దేవస్థానం సత్రాల లీజుకు వేలంపాట
దేవస్థానం సత్రాల లీజుకు వేలంపాట
Published Wed, Oct 26 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
అన్నవరం : అన్నవరం దేవస్థానానికి కొండ దిగువన పాత బస్టాండ్ సమీపంలో గల పంపా సత్రం (పంపా ఎమినిటీస్ సెంటర్), కిర్లంపూడి, శంఖవరం గ్రామాల్లోనిS సత్యదేవ కల్యాణ మండపాలను ప్రవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు దేవస్థానం అధికారులు బుధవారం సాయంత్రం టెండర్ కం వేలం నిర్వహించి ఖరారు చేశారు. పంపా సత్రం మూడేళ్లకు లీజు : అన్నవరంలోని పంపా సత్రాన్ని ఏటా పదిశాతం పెంపు పద్ధతిన మూడేళ్ల పాటు లీజు కిచ్చేందుకు బుధవారం సాయంత్రం టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించారు. ఇందులో మొదటి ఏడాదికి రూ.7.05 లక్షలు, రెండో ఏడాది పదిశాతం పెంచి చెల్లించేందుకు, రెండో ఏడాది లీజు మొత్తంపై మూడో ఏడాది పది శాతం చెల్లించేందుకు పాట ఖరారైంది. అలాగే శంఖవరం, కిర్లంపూడి గ్రామాల్లో దేవస్థానం 1999–2000 సంవత్సరాల మధ్య రూ. మూడు కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు కల్యాణ మండపాలకు లీజు కిచ్చేందుకు వేలం నిర్వహించారు. కిర్లంపూడి కల్యాణ మండపం ఏడాదికి రూ.2.55 లక్షలు, శంఖవరం కల్యాణ మండపం ఏడాదికి రూ.32 వేలుకు లీజు ఖరారైంది. పాట నిర్వహణలో దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు, ఏఈఓ లు ఎంకేటిఎన్‌వి ప్రసాద్, శ్రీనివాస్, నటరాజ్, సూపరిండెంట్ లక్ష్మణస్వామి పాల్గొన్నారు.
Advertisement