దేవస్థానానికి చేరిన 673 కేజీల వెండి
52 అచ్చులగా మార్పు
‘ఈ ఆక్షన్ ద్వారా విక్రయించే ఆలోచన : ఈఓ
అన్నవరం : హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ మింట్‌లో శుద్ధి చేసిన సత్యదేవునికి చెందిన 673 కిలోల వెండి అన్నవరం దేవస్థానానికి బుధవారం తెల్లవారుజామున చేరింది. భక్తులు సత్యదేవునికి వివిధ రూపాలలో సమర్పించిన వెండి కానుకలలో 683 కేజీల పాత వెండి ఆభరణాలు, వస్తువులను గత జూ¯ŒSలో దేవస్థానం హైదరాబాద్‌లోని మింట్‌కు తరలించిన విషయం విధితమే. అక్కడ వాటిని కరిగించి శుద్ధమైన వెండి అచ్చులుగా మార్చారు. ఒక్కో అచ్చు సుమారు 13 కిలోల బరువుతో 52 అచ్చుల రూపంలో ఈ వెండిని మింట్‌లో రూపొందించారు. వీటి విలువ సుమారు రూ.మూడు కోట్లు పైగానే ఉంటుందని అంచనా. ఈ వెండి అచ్చులను అన్నవరం దేవస్థానం అధికారుల బృందం ప్రత్యేక బందోబస్తుతో బుధవారం తెల్లవారుజామున దేవస్థానానికి చేర్చిన వెంటనే లాకర్‌లో భద్రపరచి సాయంత్రం వాటి వివరాలను వెల్లడించారు.
గోల్డ్‌బాండ్‌లలో డిపాజిట్ : ఈఓ
ఈ వెండి అచ్చులను ‘ఈ ఆక్షన్’ ద్వారా విక్రయించి వచ్చిన నగదుతో బంగారం కొనుగోలు చేసి దానిని గోల్డ్‌బాండ్‌లలో డిపాజిట్ చేయాలని ఆలోచిస్తున్నట్లు ఈఓ కె.నాగేశ్వరరావు చెప్పారు.
సత్యదేవుని డాలర్లు : కాగా, దేవస్థానానికి గతంలో ఒక దాత పది కిలోల వెండిని సమర్పించగా దానితో సత్యదేవుని వెండి డాలర్లు రూపొందించి భక్తులకు విక్రయించేం దుకు అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ వెండి డాలర్లు తయారు చేసే విషయాన్ని ఇప్పటికే దేవాదాయశాఖ కమిషనర్ వైవీ అనూరాధ దృష్టికి తీసుకువెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీనిపై లిఖిత పూర్వకంగా ఆదేశాలు తీసుకుని డాలర్లు తయారు చేయించాలని అధికారులు భావిస్తున్నారు.