సాక్షి, తూర్పుగోదావరి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖ శ్రీ శారద పీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ హర్షం వ్యక్తం చేశారు. శనివారం అన్నవరంలో స్వామీజీ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయానికి తన ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. భావితరాలు ముందుకు ఎదగడానికి ఇంగ్లీష్ ఎంతో అవసరమని.. దీంతో సామాన్య, పేద ప్రజల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయిలో రాణిస్తారని అభిలాషించారు.
నేడు బతకడానికి, బతుకుదెరువుకు ఇంగ్లీష్ అవసరం ఉందని.. లేదంటే దేశ, విదేశాల్లో ఉన్న మన తెలుగు బిడ్డలు రాణించడం కష్టమవుతుందని.. ఎలా బతుకుతారనే సందేహం వెలిబుచ్చారు. ఇంగ్లీష్ కారణంగానే ఏపీ, తెలంగాణకు చెందిన వారు ఎందరో దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. అయితే అమ్మా అని పిలవడానికి తెలుగు కావాలని, తెలుగు మన కన్నతల్లి వంటిదని అభిప్రాయపడ్డారు. అటువంటి మన తెలుగు భాషను పరిరక్షించుకోవాలని కాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment