- తుని ఎమ్మెల్యే రాజా, పర్వత ప్రసాద్‌లతో కలిసి స్వామివారికి పూజలు
సత్యదేవుని దర్శించిన రాష్ట్ర పీఏసీ చైర్మన్‘బుగ్గన’
Published Fri, Apr 28 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM
అన్నవరం :
రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, కర్నూల్ జిల్లా డో¯ŒS శాసన సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం ఉదయం రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. తుని శాసనసభ్యుడు దాడిశెట్టి రాజా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త పర్వత పూర్ణచంద్రప్రసాద్‌తో కలిసి ఆయన స్వామివారి ఆలయానికి విచ్చేశారు. వారికి పండితులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీస్సులందజేశారు. ఆలయ ఏసీ ఈరంకి జగన్నాథరావు స్వామివారి ప్రసాదాలను ఆయనకు అందించారు. బుగ్గన మాట్లాడుతూ తమ కుటుంబ ఇష్ట దైవం సత్యదేవుడని, ప్రతి నెలా తమ ఇంట్లో సత్యదేవుని వ్రతమాచరిస్తామని తెలిపారు.
అధికారంలోకి రావడం ఖాయం..
అన్నవరం వచ్చిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఆయన స్పందిస్తున్న తీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ మరో 18 నెలలు ఓపిక పడితే మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు తెలిపారు. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదృష్టం బాగుంటే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మరో నాలుగు నెలలు ఆలస్యమవుతుందే తప్ప అధికారంలోకి రావడం ఖాయం అని తెలిపారు.
సత్యదేవుని చిత్రపటాన్ని బహూకరించిన కార్యకర్తలు
సత్యదేవుని చిత్రపటాన్ని స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు బహూకరించారు. తుని మండల పార్టీ కన్వీనర్ పోతల రమణ, ఆరుమిల్లి ఏసుబాబు, నాగం గంగబాబు స్థానిక పార్టీ నాయకులు సరమర్ల మధుబాబు, ఎస్ కుమార్ రాజా, రాయి శ్రీనివాస్, ధారా వెంకటరమణ, తాడి సత్యనారాయణ, బొబ్బిలి వెంకన్న, బీఎస్‌వీ ప్రసాద్, ఆశిన శ్రీనివాస్, కొల్లు చిన్నా, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement