రూ.2.27 కోట్లతో ఆగమ పాఠశాల
Published Thu, Sep 29 2016 10:16 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
అన్నవరం:
అన్నవరం దేవస్థానంలోని సత్యగిరిపై సుమారు ఎకరం స్ధలంలో రూ.2.27 కోట్లు వ్యయంతో స్మార్త, ఆగమ పాఠశాల నిర్మాణం కోసం పిలిచిన టెండర్లను దేవస్థానం ఛైర్మన్, ఈఓలతో కూడిన పాలకవర్గం ఆమోదించింది. గురువారం దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు సమావేశమై పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
సమావేశం నిర్ణయాలివీ..
∙సత్యదేవుని శాశ్వత కల్యాణానికి రూ.పది వేలు రుసుం చెల్లించిన భక్తులకు పది సంవత్సరాలు మాత్రమే వారి పేరు మీద స్వామి, అమ్మవార్లకు కల్యాణం నిర్వహిస్తారు. గతంలోలా మూడేళ్లు పొడగించే పరిస్థితి ఇకపై ఉండదు.
∙విద్యుత్ ఝ్ఛర్జీల ఆదాలో భాగంగా ఐఎస్‌ఐ స్టార్ రేటింగ్ కలిగిన పంప్‌సెట్లనే వాడాలని నిర్ణయించారు. పాత విద్యుత్ బల్బులను తొలగించి ఎల్‌ఈడీ బల్బులనే వాడాలని నిర్ణయించారు.
∙దేవస్థానంలో ఏర్పాటు చే స్తున్న బైక్, చిన్నకార్లు స్టాండ్ల కోసం నిర్వహించిన వేలంలో ఖరారైన నెలకు రూ.61,000 వేలంపాటను సమావేశంలో ఆమోదించారు.
∙అక్టోబర్ 31 నుంచి ప్రారంభం కానున్న కార్తీకమాసంలో స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల కోసం చేపట్టనున్న ఏర్పాట్లను సమావేశంలో సమీక్షించారు. అదే విధంగా నవంబర్ 11వ తేదీన క్షీరాబ్థి ద్వాదశినాడు జరగనున్న సత్యదేవుని తెప్పోత్సవానికి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని సమావేశంలో తీర్మానించారు.
Advertisement