వైఎస్సార్ జిల్లా పోలీసులకు నిందితుడిని అప్పగిస్తున్న అన్నవరం ఎస్‌ఐ
అన్నవరం (ప్రత్తిపాడు): వైఎస్సార్ జిల్లా సుండుపల్లె పోలీస్ స్టేషన్ పరిధి రెడ్డివారిపల్లెకు చెందిన గిరిజన బాలికపై గత నెల 27న లైంగిక దాడికి పాల్పడి పరారీలో ఉన్న అర్చకుడు రవి అలియాస్ సత్యనారాయణను తూర్పు గోదావరి జిల్లా అన్నవరం పోలీసులు పట్టుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడు ఓ కాల్ చేసుకోవాలంటూ పలువురి ఫోన్లు తీసుకుని, తన సన్నిహితుడికి ఫోన్ చేసేవాడు.
అతడి ఫోన్‌ను ట్రాప్ చేసిన పోలీసులు చివరి కాల్ అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి వచ్చిందని గుర్తించి నిందితుడి వివరాలు అన్నవరం పోలీసులకు పంపించారు. స్పందించిన అన్నవరం పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకుని శనివారం రాత్రి 7.30కు విజయవాడ వైపు వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా రవిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సుండుపల్లె పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment