బషీరాబాద్: కామ పిశాచులు చెలరేగిపోతున్నారు. మొన్న వరంగల్‌లో తొమ్మిది నెలల పసికూనపై అఘాయిత్యం మరవక ముందే తాజాగా జిల్లా పరిధిలోని బషీరాబాద్ మండలం బోజ్యానాయక్‌తండాలో మరో ఘటన వెలుగుచూసింది. పదకొండేళ్ల బాలికపై తండ్రి వయసున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బొంరాస్‌పేట మండలం ఊరెనికితండాకు చెందిన గిరిజన దంపతులు బతుకుదెరువు కోసం కొంతకాలం కిందట పూణెకు వెళ్లారు. తమ ముగ్గురు పిల్లలను చదివించడానికి బషీరాబాద్ మండలం బోజ్యానాయక్‌తండాలోని అమ్మమ్మ ఇంట్లో ఉంచారు. మొదటి కుమార్తె (11) 6వ తరగతి చదువుతోంది. అయితే ఈ నెల 19వ తేదీన బడికి వెళ్లిన బాలిక ఇంటికి వచ్చింది.
ఇదే గ్రామానికి చెందిన తాక్య్రనాయక్ (50) లారీ డ్రైవర్‌గా, నాపరాతి గనుల్లో కార్మికుడిగా పని చేస్తుంటాడు. తంబాకు (పొగాకు) తీసుకురమ్మని దుకాణానికి పంపించాడు. దుకాణానికి వెళ్లి వచ్చిన బాలికను ఇంట్లోకి లాకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని చిన్నారి ఇంట్లో చెప్పింది. వెంటనే కుటుంబసభ్యులు పుణెలోని బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు తండాకు వచ్చి జరిగిన ఘటనపై పెద్ద మనుషులతో మాట్లాడారు. అప్పటికే అత్యాచారం చేసిన తాక్య్రనాయక్ పరారయ్యాడు. జరిగిన ఘటనపై బషీరాబాద్ పోలీసులకు ఈ నెల 23వ తేదీన బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడు. విచారణ చేసిన తాండూరు డీఎస్పీ రామచంద్రుడు, పట్ణణ సీఐ రవి నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని సోమవారం పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.
మొదటి నుంచి వక్రబుద్ధి..
బోజ్యానాయక్‌తండాకు చెందిన తాక్య్రనాయక్ మొదటి నుంచి వక్రబుద్ధితోనే ఉన్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలిసింది. మొదటి భార్య చనిపోగానే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె వదిలేయడంతో అక్క కూతురును పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా రెండేళ్లుగా ఇతడికి దూరంగా ఉంటోంది. దీంతో లారీ డ్రైవర్‌గా, నాపరతి గనుల్లో లేబర్‌గా పనిచేస్తు తండాలో ఉంటున్నాడని పోలీసుల విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment