
దారుణానికి గురైన బాలిక
రాయగడ: జిల్లాలోని మారుమూల చంద్రపూర్ సమితిలో ఆదివాసీ బాలికపై ఓ మృగాడు లైంగికదాడికి పాల్పడి హత్య చేశాడు. వివరాలిలా ఉన్నాయి. సమితిలోని చిచ్చపంగి గామానికి చెందిన ఆదివాసీ బాలికను చంద్రపూర్ సమితి కేంద్రంలోని హాస్టల్‌లో విడిచిపెడతానని అదే గ్రామానికి చెందిన యువకుడు నమ్మించి 21వ తేదీన బైక్‌పై తీసుకువెళ్లాడు. సమితి కేంద్రానికి చేరే దారిలో అదే గ్రామం అడవిలో బాలికపై లైంగికదాడికి పాల్పడి, హత్య చేశాడు.
తమ కూతురు శనివారం నుంచికనిపించడం లేదని బాలిక కుటుంబసభ్యులు చంద్రపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహించిన కుటుంబసభ్యులు, గ్రామప్రజలు రెండు రోజులుగా చంద్రపూర్ ఆదర్శ విద్యాలయం హాస్టల్ భవనం, పోలీస్‌స్టేషన్ వద్ద నిరసనలు చేశారు. చంద్రపూర్‌లోని ప్రధాన రహదారులను దిగ్బంధించారు. అయితే గ్రామానికి చెందిన అడవిలో బాలిక మృతదేహాన్ని మంగళవారం గుర్తించిన గ్రామస్తులు బాలికపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసినట్లు గుర్తించారు. బాలిక మృతదేహాన్ని గుర్తించిన ప్రజల సమాచారం మేరకు వచ్చిన పోలీసు వాహనాన్ని గ్రామస్తులు అడ్డుకుని నిరసన మరింత ఉద్ధృతం చేశారు. అయితే పోలీసులు, సైంటిఫిక్ టీమ్, పోలీసుడాగ్‌తో తక్షణమే దర్యాప్తు చేసి గ్రామానికి చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment