స్వామి, అమ్మవార్లకు అరుంధతీ నక్షత్ర దర్శనం
అన్నవరం: సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం నవదంపతులు శ్రీసత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లకు స్థాలీపాక హోమాలు ఘనంగా నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు స్వామి, అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి అరుంధతి నక్షత్రం చూపించి పూజలు చేశారు. వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, వ్రతపురోహిత ప్రముఖులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్, అర్చకస్వామి కోట శ్రీను తదితరులు పాల్గొన్నారు.