20 కిలోల గంజాయి స్వాధీనం
20 కిలోల గంజాయి స్వాధీనం
Published Sun, Feb 19 2017 12:37 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM
అన్నవరం : రత్నగిరిపైకి వెళుతున్న ఆటోను తనిఖీ చేస్తున్న క్రమంలో 20 కిలోల గంజాయిని టోల్‌గేట్ వద్ద సిబ్బంది పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ సహా వాహనంలోని నలుగురు వ్యక్తులు పరారయ్యారు. దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు ప్రత్తిపాడు
ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎక్సైజ్ ఎస్‌ఐ నాగరాజు శనివారం రాత్రి అన్నవరం వచ్చి ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లాకు చెందిన ఆటోలో కొందరు వ్యక్తులు శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రత్నగిరి టోల్‌గేట్ వద్దకు వచ్చారు. కొండపైకి వెళ్లడానికి టోల్ ఫీజు చెల్లించేందుకు ఆగారు. డ్రైవర్ సహా నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఆటో వెనుక సీటులో రెండు పెద్ద బ్యాగ్‌లు ఉండడంతో అనుమానం వచ్చిన హోంగార్డు శివ వాటిని తనిఖీ చేశారు. వెంటనే ఆటోలోని వారంతా పరారయ్యారు. ఒక్కొక్క బ్యాగ్‌లో రెండు కిలోల బరువు గల ఐదు ప్యాకెట్ల వంతున పది గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. వెంటనే దేవస్థానం ఈఓ నాగేశ్వరరావుకు సమాచారం అందించారు. ఆయన వచ్చి గంజాయి ప్యాకెట్లను పరిశీలించి ప్రత్తిపాడు ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నాగరాజు సిబ్బందితో వచ్చి ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఆటోలో లభించిన డ్రైవింగ్ లైసె¯Œ్స ఆధారంగా విశాఖ జిల్లా తంజంగి సమీపంలోని చింతపల్లికి చెందిన జి. చిన్నబ్బాయి ఆటోగా పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఆటోను పట్టుకున్న హోంగార్డు శివను ఈఓ , పోలీసులు అభినందించారు.
Advertisement
Advertisement