84 కేజీల గంజాయి స్వాధీనం
84 కేజీల గంజాయి స్వాధీనం
Published Thu, Mar 23 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM
తమిళనాడుకు చెందిన ఐదుగురి అరెస్టు
రాజమహేంద్రవరం సిటీ : రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి తరలించేందుకు సిద్ధం చేసిన ఆరు బ్యాగుల్లోని సుమారు 84 కేజీల గంజాయిని ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ టీఎస్‌ఆర్ కృష్ణ నేతృత్వంలో స్వాధీనం చేసుకున్నారు. దీనిని రైల్వే పోలీ సులకు అప్పగించారు. గురువారం ప్రధాన రైల్వేస్టేషన్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వేషన్ పొందిన తమిళనాడుకు చెందిన పూజ, జ్యోతి, మురుగేష్, శేఖర్, సందీప్‌లు మొదటి ప్లాట్‌ఫాంకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ తనిఖీలు చేస్తున్న ఆర్‌పీఎఫ్ సిబ్బంది అనుమానాస్పదంగా ఉన్న బ్యాగ్‌లను పరిశీలించారు. గంజాయి ఉన్నట్టు అనుమానించడంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా గంజాయిని తునిలో కొను గోలు చేసి ఢిల్లీ తీసుకు వెళుతున్నట్టు చెప్పారు. నిందితులను, గంజాయిని రైల్వే పోలీసులకు అప్పగించారు. జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ ఆర్‌వీవీ సత్యనారాయణ మాట్లాడుతూ 84 కేజీల గంజాయి స్వాధీన పరుచుకున్నామని, దీని విలువ రూ.లక్ష ఉంటుందని అంచనా వేసినట్టు తెలిపారు. కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Advertisement