కోయంబత్తూరు : ప్రసాదం తిని అస్వస్థతకు గురైన ఇద్దరు మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తమిళనాడులోని మెట్టుపాలాయంలోని సెల్వముత్తు మరియమ్మమ్ ఆలయంలో ప్రసాదం తిని సుమారు 30మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఆలయంలో ప్రసాదం స్వీకరించిన 30 మంది భక్తులకు వాంతులు, విరేచనాలు కావడంతో వారిని మెట్టుపాలాయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్‌గా నిర్ధారించిన వైద్యులు చికిత్స చేపట్టారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లోకనాయకి, సావిత్రి గురువారం ఉదయం మృతి చెందారు. మిగతా 28మందికి డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ఆలయంలో తయారుచేసే ప్రసాదానికి పాడైపోయిన నెయ్యి, నూనె వాడటమే ఫుడ్ పాయిజన్ కావడానికి కారణంగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment