రైతులకు అందుబాటులో ఉండాలి
Published Sun, Jul 31 2016 1:59 AM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
పోచమ్మమైదాన్ : వ్యవసాయ అధికారులు నిత్యం రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహాయ సంచాలకులు డాక్టర్ రఘురామిరెడ్డి అన్నారు. వరంగల్ ములుగురోడ్డు సమీపాన ఉన్న ప్రాం తీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం శాస్త్రవేత్త శ్రీనివాస్ అధ్యక్షత న నిర్వహించిన వ్యవసాయ అధికారు ల శిక్షణ, సందర్శన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సాగు చేసిన పప్పుదినుసు పంటలు 15–45 రోజుల మధ్యలో ఉన్నాయని, వాతవరణం మరుకా మచ్చల పురుగుకు అనుకులంగా ఉన్నందున జాగ్రత్త వహించాలని సూచించారు. రైతులు ముందస్తుగా వేపనూనె 5మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని చెప్పారు. పత్తి పంట 40–45 రోజుల వయస్సులో ఉందని, ఈ తరుణంలో 20ః20, కాంప్లెక్స్ ఎరువులు వాడకూడదని, ఎకరానికి 35 కిలోల యూరియా, 15 కేజీల పోటాష్ వేయాలని సూచించారు. గడ్డి మందులను నిపుణుల సూచన మేరకు వాడాలని, ఎట్టి పరిస్థితులోనూ ఆగస్టు 31 లోపల వరి నాట్లు వేయాలని వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సంచాలకులు ఉషాదయాళ్ ప్రసంగిం చగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement