బెల్టు షాపులపై ఎక్సైజ్ అధికారుల దాడులు
Published Sat, Aug 6 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
మహబూబాబాద్ : బెల్ట్‌షాపులపై ఏకకాలంలో దాడులు నిర్వహించి మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ తిరుపతి తెలిపారు. ఆయన కథనం ప్రకా రం.. ఉన్నతాధికారుల అదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్, ఎస్టీఎఫ్ ఆద్వర్యంలో మానుకోటలోని భవానినగర్ తండా, మండలంలోని వేంనూర్ దాని శివారు నేతాజీతండా, కేసముద్రంలోని రంగాపురం, నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు, గ్రామాల్లోని బెల్ట్‌షాపులపై దాడులు నిర్వహించారు. 14 కేసులు నమోదు చేశా రు. 223 క్వార్టర్ బాటిళ్లు, 16 ఆఫ్ బాటిళ్లు, 5 పుల్‌బాటిళ్లు, 90 బీర్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అలాగే పట్టణంలోని వైన్స్‌లపై కూడా దాడులు నిర్వహించి బాటిళ్ల లేబుల్స్, స్టిక్కర్లను పరిశీలించారు. ఆ మద్యం ఆ షాపులకు చెందినవా లేదా అనే కోణంలో తనీఖీలు చేశారు. అవి సక్రమంగానే ఉన్నట్లు ఆయన వివరించారు. దాడుల్లో ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ శశిధర్‌రెడ్డి, సీఐలు కె.తిరుపతి, చంద్రశేఖర్, ఎసైలు రవికుమార్, మనోహర్, లింగయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement