ఆడ శిశువు మృతదేహం లభ్యం | Availability of female baby body | Sakshi
Sakshi News home page

ఆడ శిశువు మృతదేహం లభ్యం

Published Sat, Dec 24 2016 1:00 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

Availability of female baby body

కణేకల్లు: కణేకల్లు–ఎర్రగుంట మార్గమధ్యంలోని కల్వర్టు వద్ద ఆదివారం ఓ ఆడశిశువు మృతదేహం లభ్యమైంది. అటువైపు బైక్‌పై వెళ్తున్న కొందరికి కల్వర్టు వద్ద కుక్కలుండటం గమనించారు. దగ్గరకెళ్లి కుక్కలను తరిమేయగా వారికి మృతశిశువు కనిపించింది. వెంటనే  పైన పేర్కొన్న గ్రామాల వారికి విషయం తెలిపారు. వారొచ్చి మృత శిశువును చూసి కంటతడి పెట్టారు. బతికుండగా పడేసి వెళ్లారో, లేక చనిపోయాక ఖననం చేయకుండా వదిలేసి వెళ్లారో అంతుబట్టడం లేదు. పసికందును అలా పడేయటానికి వారికి మనసెలా వచ్చిందోనంటూ శాపనార్థాలు పెట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement