చెరువులో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
చెరువులో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
Published Sat, Oct 8 2016 12:12 AM | Last Updated on Wed, Apr 3 2019 5:44 PM
మామునూరు : చెరువులో ఈత కొట్టేం దుకు వెళ్లి గల్లంతైన విద్యార్థి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. నీటిలో కొట్టుకుపోయిన తమ కుమారుడు తిరి గి వస్తాడునుకుని కోటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. వివరాల్లోకి వెళితే.. హన్మకొండ మండలం తిమ్మాపురం పరిధిలోని బెస్తం చెరువులో గురువారం మధ్యాహ్నం ఈత కొట్టేందుకు వెళ్లిన నలుగురు విద్యార్థుల్లో లెనిన్నగర్‌కు చెందిన ఇమ్మడి మొగిలి, అరుణ దంపతుల కుమారుడు ఇమ్మడి భవన్ (17) చెరువులో మునిగి గల్లంతైన విషయం తెలి సిందే. అయితే పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టినా మృతదేహం లభ్యం కాలేదు. ఈ క్రమంలో మామునూరు ఏసీపీ మహేందర్ ఆదేశాల మేరకు శుక్రవారం సీఐ పి.శ్రీని వాస్ పర్యవేక్షణలో ఎస్‌సైలు రాంప్రసాద్, యుగేంధర్ నేతృత్వంలో ధర్మసాగర్ రిజర్వాయర్‌కు చెందిన గజ ఈ తగాళ్లు, జాలర్లు మర పడవల సాయం తో బెస్తం చెరువులో గాలింపులు చేపట్టగా సాయంత్రం 4 గంటల సమయంలో ఇమ్మడి భవన్ మృతదేహం లభించింది. ఈ సందర్భంగా వారు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. కాగా, కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, బంధువులు రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. ఇప్పుడే వస్తానని స్నేహితులతో కలిసి వెళ్లిన కొడుకు శవమై వచ్చాడని వారు బోరు న విలపించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడి తండ్రి ఇమ్మ డి మొగిలి ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.శ్రీనివాస్ తెలిపారు.
Advertisement