
సాక్షి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. వసంతవాడ వాగులొ ఈతకు వెళ్లిన ఆరుగురు గల్లంతు అయ్యారు. గల్లంతు అయిన ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు భూదేవి పేటకు చెందినవారుగా గుర్తించారు. ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మృతుల వివరాలు
1) గంగాధర వెంకట్రావు,16 సంవత్సరాలు
2) శ్రీరాముల శివాజీ,16 సంవత్సరాలు
3) గొట్టుపర్తి మనోజ్,16 సంవత్సరాలు
4) కర్నటి రంజిత్, 15 సంవత్సరాలు
5) కెల్లాసాయి,16 సంవత్సరాలు
6) కూనవరపు రాధాకృష్ణ,15 సంవత్సరాలు
Comments
Please login to add a commentAdd a comment