ఎర్రకాలువ బ్రిడ్జిపై సినీఫక్కీలో ‍ప్రమాదం | accidant at red canal bridge | Sakshi
Sakshi News home page

ఎర్రకాలువ బ్రిడ్జిపై సినీఫక్కీలో ‍ప్రమాదం

Published Tue, Aug 29 2017 10:26 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఎర్రకాలువ బ్రిడ్జిపై సినీఫక్కీలో ‍ప్రమాదం - Sakshi

ఎర్రకాలువ బ్రిడ్జిపై సినీఫక్కీలో ‍ప్రమాదం

మూడు వాహనాల ఢీ 
రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం 
ప్రయాణికుల అవస్థలు  
నల్లజర్ల : అనంతపల్లి ఎర్రకాలువ బ్రిడ్జిపై మంగళవారం వేకువజామున సినీఫక్కీలో ‍ప్రమాదం జరిగింది.  ఏలూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న సిమెంట్‌ లోడు లారీ ఎదురుగా వస్తున్న మరో లోడు లారీని ఢీకొని ముందుకు దూసుకెళ్ళింది. ఈ క్రమంలో మరో మినీవ్యాన్‌ను ఢీకొని ఆగింది. ఈ ఘటనలో సిమెంట్‌ లారీ క్లీనర్‌ రామారావుకు స్వల్పగాయాలు అయ్యాయి.  వాహనాలు బ్రిడ్జికి అడ్డుగా నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. సుమారు రెండుగంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి.  హైదరాబాద్‌ నుంచి విశాఖకు హైటెక్‌ బస్సులలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు చిన్న వాహనాలను పక్కనే ఉన్న తాడిపూడి వంతెనపై మళ్ళించారు. హైవేపెట్రోలింగ్‌  సిబ్బంది క్రేన్‌ సాయంతో వాహనాలను పక్కకు తొలగించినట్టు హైవేపెట్రోలింగ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ అంభేశ్వరావు తెలిపారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement