red canal
-
ఎర్రకాలువ జలాశయానికి మహర్దశ
జంగారెడ్డిగూడెం: సీఎం జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటూ వారికి పెద్ద పీట వేస్తోంది. రైతుకు కావాల్సిన అన్ని రకాల సాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయడమే కాకుండా పాత ప్రాజెక్టులకు మరమ్మతులు చేపట్టింది. ఇందులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కేకేఎం ఎర్రకాలువ జలాశయం ఆధునికీకరణ పనులకు సంబంధించి ప్రతిపాదనలు చేయాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆధునికీకరణ పనులు అటుంచి కనీసం అవసరమైన మరమ్మతులు కూడా చేపట్టలేదు. ఎర్రకాలువ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 4.28 టీఎంసీలుగా నిర్ధేశించారు. ప్రాజెక్టు ఆక్రమణలకు గురికావడంతో 3.5 టీఎంసీలకు మించి నిల్వ చేయలేకపోతున్నారు. ఆధునికీకరణ పనుల మరమ్మతులకు తాజాగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ. 75.80 కోట్లతో ప్రతిపాదనలు కేకేఎం ఎర్రకాలువ ప్రాజెక్టు ఆధునికీకరణ, మరమ్మతులకు జలవనరుల శాఖాధికారులు రూ.75.80 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. వీటిలో 2018లో తుఫాన్ వల్ల కొట్టుకుపోయిన ప్రధాన కాలువ రిటైనింగ్ వాల్, జనరేటర్లు, ఎర్త్‌డ్యామ్ పటిష్టం, నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ఎర్త్ డ్యామ్ రోడ్ ఏర్పాటు, భవనాల ఆధునికీకరణకు ప్రతిపాదించారు. ప్రతిపాదనలు ♦ ఎర్త్‌డ్యామ్, స్పిల్‌వే బలోపేతం చేయడానికి రూ.60 కోట్లతో ప్రతిపాదించారు. ♦ ప్రాజెక్టు గేట్లు, సాంకేతిక పరికరాలు, మరమ్మతు పనులు, పునరుద్ధరణకు రూ. 43.20 లక్షలు ♦ 2018లో వరద తాకిడికి కొట్టుకుపోయిన ప్రధాన కాలువ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ. 4.50 కోట్లు ♦ ప్రాజెక్టు ఎర్త్డ్యామ్కు లోపలి భాగంలో కాంక్రీట్ వేసేందుకు రూ. 4.21 కోట్లు ♦ ఎర్త్ డ్యామ్ మరమ్మతులకు రూ.1.39 కోట్లు ♦ప్రాజెక్టుకు వరదల సమయంలో వరద ఉధృతిని ఎప్పటికప్పుడు తెలిపేందుకు రిమోట్ వాటర్ లెవల్ సెన్సార్లు అమర్చేందుకు రూ.50 లక్షలతో ప్రతిపాదించారు. ♦ డ్యామ్ చుట్టూ జంగిల్ క్లియరెన్స్, గ్రావెల్ ఫిల్లింగ్ తదితర పనులకు రూ. 27లక్షలు, డ్యామ్‌కు యాక్సిస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా సీసీ రోడ్డు నిరి్మంచేందుకు రూ.3 కోట్లు ♦ ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద ఉన్న భవనాల మరమ్మతులు, ఆధునీకరణకు రూ.5 లక్షలతో ప్రతిపాదనలు ♦ప్రాజెక్టు వద్ద కంట్రోల్‌రూమ్ నిర్మాణానికి రూ.20 లక్షలు, ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ.30 లక్షలు డ్యామ్ పరిసర ప్రాంతంలో విద్యుదీకరణకు రూ.5 లక్షలు ♦ప్రస్తుతం ఉన్న జనరేటర్‌కు అదనంగా స్టాండ్‌బైగా మరో 70 కేవీఏ జనరేటర్ ఏర్పాటుకు రూ.20 లక్షలు కేటాయించారు. అలాగే ఎర్రకాలువ ప్రాజెక్టు ఫోర్‌షోర్ ఏరియా ఆక్రమణలకు గురికావడంతో రీసర్వే చేసి ఆక్రమణలు తొలగించేందుకు రూ. 20 లక్షలతో అంచనా వేశారు. -
ముంచేసిన ఎర్రకాలువ
పశ్చిమగోదావరి, నిడదవోలు రూరల్: ఎర్ర కాలువ ఉగ్రరూపం దాల్చి పల్లెలను, పంటపొలాలను నీట ముంచేసింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన వరదనీరు ప్రళయం సృష్టిస్తోంది. నిడదవోలు మండలంలోని కంసాలిపాలెం, రావిమెట్ల, శంకరాపురం, సింగవరం, తాళ్లపాలెం గ్రామాల్లోని పంటపొలాలు, రోడ్లపై 4 అడుగుల ఎత్తున వరద నీరు చేరింది. గత మూడు రోజులుగా భారీగా వరదనీరు చేరడంతో 10,300 ఎకరాల్లో పంట నీట మునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కంసాలిపాలెం– మాధవరం, సింగవరం–కంసాలిపాలెం, మాధవరం–కంసాలిపాలెం మధ్య రాకపోకలు స్తంభించాయి. కంసాలిపాలెం గ్రామ ప్రజలు ఎటూ వెళ్లే దారిలేకపోవడంతో జలదిగ్బంధంతో తల్లడిల్లుతున్నారు. మంగళవారంరాత్రి శెట్టిపేట రైల్వే బ్రిడ్జి వద్ద నీరు చేరడంతో తాడేపల్లిగూడెం వెళ్లే వాహనాలు దారి మళ్లించారు. జలవిద్యుత్ కేంద్రం నీటమునిగింది. శెట్టిపేట లాకుల వద్ద పశ్చిమడెల్టా కాలువలోకి ఎర్రకాలువ నీరు చేరుతోంది. సింగవరం, తాళ్లపాలెం గ్రామాల్లోని పలు కాలనీల చుట్టూ వరదనీరు చేరి బయటకు అడుగువేయలేని పరిస్థితి. నిడదవోలు–యర్నగూడెం ప్రధాన రోడ్డుపై బుధవారం భారీగా నీరు చేరడంతో తిమ్మరాజుపాలెం, సూరాపురం, కాటకోటేశ్వరం, తాడిమళ్ల, కోరుమామిడి, యర్నగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు గోదారమ్మ ఉగ్రరూపం ఎత్తడంతో పురుషోత్తపల్లి, పందలపర్రు, పెండ్యాల, విజ్జేశ్వరం, అమ్మేపల్లి, కోరుమామిడి, ఉనకరమిల్లి, రావిమెట్ల, సింగవరం, జె.కండ్రిగ, కంసాలిపాలెం, తాళ్లపాలెం గ్రామాల పరిధిలోని వరి, చెరకు, అరటి, కూరగాయల పంటలు, ఇటుక బట్టీలు నీటమునిగి రైతులు భారీగానష్టపోయారు. తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోకివరదనీరు చేరడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. నూతనంగా నిర్మించిన తొమ్మిది అడుగుల రాజగోపురం ప్రారంభోత్సవ కార్యక్రమాల ఏర్పాట్ల పనులకు ఆటంకం కలుగుతోంది. కంసాలిపాలెం గ్రామం చుట్టూ నీరుచేరడంతో గ్రామస్థులంతా ఇళ్లకే పరిమితమయ్యారని,ఉపాధి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఉపసర్పంచ్ కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు. -
ఎర్రకాలువ బ్రిడ్జిపై సినీఫక్కీలో ప్రమాదం
మూడు వాహనాల ఢీ రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ప్రయాణికుల అవస్థలు నల్లజర్ల : అనంతపల్లి ఎర్రకాలువ బ్రిడ్జిపై మంగళవారం వేకువజామున సినీఫక్కీలో ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న సిమెంట్ లోడు లారీ ఎదురుగా వస్తున్న మరో లోడు లారీని ఢీకొని ముందుకు దూసుకెళ్ళింది. ఈ క్రమంలో మరో మినీవ్యాన్‌ను ఢీకొని ఆగింది. ఈ ఘటనలో సిమెంట్ లారీ క్లీనర్ రామారావుకు స్వల్పగాయాలు అయ్యాయి. వాహనాలు బ్రిడ్జికి అడ్డుగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. సుమారు రెండుగంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు హైటెక్ బస్సులలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు చిన్న వాహనాలను పక్కనే ఉన్న తాడిపూడి వంతెనపై మళ్ళించారు. హైవేపెట్రోలింగ్ సిబ్బంది క్రేన్ సాయంతో వాహనాలను పక్కకు తొలగించినట్టు హైవేపెట్రోలింగ్ హెడ్ కానిస్టేబుల్ అంభేశ్వరావు తెలిపారు. -
జలక్రీడలకు కేంద్రంగా ఎర్రకాలువ జలాశయం
జలక్రీడలకు అనువుగా జలాశయం గుర్తింపు కార్యరూపం దాల్చితే జలాశయానికి మహర్ధశ ఇప్పటికే పర్యాటక కేంద్రంగా గుర్తింపు జలాశయంలో సెయిలింగ్, రోయింగ్, కెనాయింగ్ తదితర క్రీడల అభివృద్ధికి ప్రతిపాదనలు జంగారెడ్డిగూడెంః జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలో జలక్రీడల అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జలక్రీడలకు కేకేఎం ఎర్రకాలువ జలాశయం అనువుగా ఉందని నిపుణుల కమిటీ గుర్తించింది. దీంతో ఎర్రకాలువ జలాశయంలో సెయిలింగ్, రోయింగ్, కెనాయింగ్ తదితర జలక్రీడలకు నిర్వహణ చర్యలు తీసుకుంటుంది. అక్టోబర్‌లో కేరళకు చెందిన రోయింగ్ శిక్షకుడు ద్రోణాచార్యఅవార్డు గ్రహీత జోస్జాకబ్, కనోయింగ్ కయాకింగ్ శిక్షకుడు అర్జునఅవార్డు గ్రహీత ఎస్సీజీ కుమార్‌తో కూడిన నిపుణుల బృందం, రాష్ట్రంలో కృష్ణాగోదావరి నదుల్లో జలక్రీడలు నిర్వహించేందుకు వాటిని అభివృద్ధి చేసేందుకు అవకాశాలపైన, సాధ్యాసాధ్యాలపైన అధ్యయనం చేసింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో విజయవాడ కృష్ణనది పున్నమిఘాట్, నాగాయలంక కృష్ణాతీరం, పశ్చిమగోదావరి జిల్లాలోని ఎర్రకాలువ జలాశయం వీటికి అనువుగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. దీనిఇకి సంబంధించి నివేదికను ప్రభుత్వానికి అందించింది. నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు సిద్దం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జలక్రీడల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తుంది. జలక్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పన, క్రీడాపరికరాల కొనుగోలు, మౌలిక సదుపాయాలు స్పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్)కల్పించేందుకు త్వరలో ప్రాజెక్టు నివేదికను తయారుచేయనున్నట్లు తెలిసింది. పర్యాటక కేంద్రంగా ఎర్రకాలువ జలాశయంః కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయాన్ని ప్రభుత్వం 2013లో పర్యాటక కేంద్రంగా గుర్తించింది. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 3.20 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసింది. ఈ నిధులతో జలాశయం వద్ద రెస్టారెంట్, వసతిగృహాలు, జలాశయం లో బోటింగ్ కోసం వెచ్చించనుంది. అయితే నిధులు లేమి కారణంగా పనులు సజావుగా సాగడం లేదు. ఇప్పటికే పర్యాటక కేంద్రంగా గుర్తించి పనులు నిర్వహిస్తుండగా , తాజాగా ఈ జలాశయాన్ని జలక్రీడల అభివృద్దికి ప్రభుత్వం ఎంపిక చేసింది. ఎర్రకాలువ జలాశయంలో జలక్రీడలు ఇవేః ఎర్రకాలువ జలాశయంలో జలక్రీడల అభివృద్దిలో భాగంగా సెయిలింగ్, రోయింగ్, కెనాయింగ్ తదితర జలక్రీడలు నిర్వహించనున్నారు. వీటిలో క్రీడాకారులకు శిక్షణ కూడా ఇస్తారు. జలక్రీడలకు అనువైన ప్రాంతంగా జలాశయాన్ని గుర్తించి అభివృద్ధి చేయనున్నారు. ఇదే కార్యరూపం దాల్చితే ఎర్రకాలువ జలాశయాన్కి మహర్ధశ పట్టినట్లే ఈ జలక్రీడల అభివృద్ధికి న్యూజిలాండ్‌నుంచి సహకారం తీసుకునేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం న్యూజిలాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. -
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 32 ట్రాక్టర్లు స్వాధీనం
నల్లజర్ల: ఎర్రకాలువ నుండి ఇసుక రవాణా నిషేధించినా అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్లపై అధికారులు కేసు నమోదు చేసారు.తహసిల్ధారు పి.పద్మావతి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం రూరల్ సి.ఐ.జి.మధుబాబు సోమవారం ఉదయం కవులూరు–పోతవరం మధ్య ఎర్రకాలువ నుండి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 32ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసారు.పోలీస్ స్టేషన్‌కు 7ట్రాక్టర్లు ఇసుకతో రాగ మిగిలినవి ఇసుకను మార్గమధ్యమంలో ఒంపేసి తీసుకువచ్చారు.సి.ఐ మధుబాబుతో పాటు పోతవరం విఈర్‌ఓలు ఫణిబాబు,సి.హెచ్.రాంబాబు ఉన్నారు.