నిఖిల్ మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు ,నిఖిల్ (ఫైల్)
తూర్పుగోదావరి, మారేడుమిల్లి: ప్రకృతి ఒడిలో సేద తీరుదామని విహార యాత్రకు వచ్చిన ఓ కుటుంబంలో పెను విషాదం మిగిలింది. సరదాగా కొండ కాలువలో స్నానాకి దిగి ఓ యువకుడు ఊబిలో కూరుకుపోయి మృత్యవాత పడ్డాడు. రాజమహేంద్రవరం నుంచి 14 మందితో కూడిన కుటుంబ సభ్యులు శనివారం మారేడుమిల్లి విహార యాత్రకు వచ్చారు. అక్కడ నుంచి ప్రసిద్ధ పర్యా టక ప్రదేశమైన గుడిసె గ్రామానికి రెండు వాహనాల్లో తరలి వెళ్లారు. శనివా రం రాత్రి అక్కడ బస చేసి, ఆదివారం తిరిగి మారేడుమిల్లి వస్తుండగా మార్గ మధ్యంలోని ఆకుమామిడి కోట సమీపంలో సంగువ కొండ కాలువలో స్నానానికి దిగారు. స్నానాలు చేస్తుండగా వారిలో సూరపురెడ్డి నిఖిల్æగోపి (23) కాలులోని ఊబిలో కూరుకుపోయాడు.
మిగిలిన వారు అతడిని ఊబిలోంచి బయటకు తీసి, మారేడుమిల్లి పీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే అతడు మృతి చెందినట్టు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్డం నిమిత్తం రంపచోడవరం ఏరి యా ఆస్పత్రికి తరలించారు. అప్పటి వరకూ తమ కళ్ల ముందు ఆనందంగా కేరింతలు కొట్టిన కుమారుడు మృతి చెందటంతో తల్లిదండ్రులు, బంధువు లు కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. మృతుడు నిఖిల్‌గోపి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. రాజహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డు ప్రాంతానికి చెందిన సూరపురెడ్డి నాగేశ్వరరావుకు ఇద్దరు కుమారు కాగా, మృతుడు నిఖిల్ పెద్ద కుమారుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment