
కాలువ పారేదెలా?
► అధ్వానంగా ఎస్సారెస్పీ ఉపకాలువలు
► నిలువెత్తు చెట్లు..నిండిన పూడిక
► చి‘వరి’కి నీరందడం అనుమానమే
నిండా పూడిక. . నిలువెత్తు పెరిగిన చెట్లతో ఎస్సారెస్పీ ఉపకాలువలు అధ్వానంగా మారారుు. చుక్క నీరు ముందుకుసాగని దుస్థితి. ఎల్‌ఎండీ నిండా నీరున్నా చి‘వరి’కి నీరందడం అనుమానమే. కాకతీయ ఉపకాలువలు గండ్లు పడి, డీపీలు పాడరుు మరమ్మతుకు నోచుకోవడం లేదు. డిసెంబర్ మొదటి వారంలోనే ఎస్సారెస్పీ అధికారులు నీటి విడుదలకు ప్రణాళికలు రూపొందించారు. అరుుతే ఈలోపే ఉపకాలువలను మరమ్మతు చేస్తే తప్ప ఆయకట్టు చివరి భూములకు నీరందే పరిస్థితి కనిపించడం లేదు. - మానకొండూర్
5 లక్షల ఎకరాలకు సాగునీరు
దిగువ మానేరు పరిధిలోని కాకతీయకాలువ ద్వారా 5 లక్షల ఎకరాలకుపైగా సాగు నీరందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కరీంనగర్, వరంగల్‌రూరల్, వరంగల్‌అర్బన్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 71 డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా సాగునీరందించనున్నారు. గతంలోనే ప్రభుత్వం ప్రధాన కాలువను రూ.1.30కోట్లతో ఆధునికీకరించింది. కాలువ సామర్థ్యాన్ని సైతం అధికారులు ఇప్పటికే పరీక్షించారు. కానీ సమస్య ఉపకాలువల వద్ద ఉంది.
అధ్వానంగా ఉపకాలువలు
ఉపకాలువల పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రధాన కాలువను మరమ్మతు చేసిన ప్రభుత్వం ఉపకాలువలపై దృష్టిసారించలేదు. సెప్టెంబర్‌లో ప్రధాన కాలువకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు మానకొండూర్ మండల పరిధిలోని దేవంపల్లి వద్ద ఉన్న డీబీఎం6 ఉపకాలువ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఎక్కువ మొత్తంలో నీరు విడుదల చేశారు. నీటి సామర్థ్యం పెంచడంతో ఉపకాలువకు కేవలం కిలోమీటరు దూరంలోనే గండిపడింది. దీంతో నీరంతా వృథాగా పోరుుంది.
చెత్తాచెదారం
ఉపకాలువలు చెత్తచెదారంతో ఉన్నారుు. గతంలోనే ఉపాధిహామీ ద్వారా కాకతీయ ఉపకాలువల్లో పూడికను, చెట్లను తొలగించారు. అరుుతే ఈ పనులు కొన్ని ఉపకాలువలకే మంజూరుకావడంతో చాలా కాలువల్లో నిలువెత్తు పెరిగిన చెట్లు దర్శనమిస్తున్నారుు. వీటిని తొలగించకపోతే ఆయకట్టు సగం భూములకు సైతం నీరందే పరిస్థితి లేదని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాలువలను బాగు చేయాలని కోరుతున్నారు.
పెరిగిన కాలువ సామర్థ్యం
కాకతీయ కాలువను ఆధునికీకరణ చేపట్టి నీటి సామర్థ్యాన్ని పెంచారు. గతంలో రెండు వేల క్యూసెక్కులు సాగునీరు వదిలిన అధికారులు, గత సెప్టెంబర్‌లో ఐదు వేల క్యూసెక్కులు వరకు విడుదల చేసి కాలువ సామర్థ్యాన్ని పరీక్షించారు. ప్రధాన కాలువ సామర్థ్యం పెరిగినా ఆ స్థారుులో బలంగా ఉపకాలువలు లేవని రైతులు, అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కలెక్టర్ దృష్టికి ఉపకాలువల దుస్థితి
ఉపకాలువ పరిస్థితిని కలెక్టర్ దృష్టికి ఎస్సారెస్పీ అధికారులు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఉపకాలువలను బాగు చేసేందుకు నిధులు అవసరమని వి న్నవించినట్లు ఎస్సారెస్పీకి చెందిన ఓ అధికారి తెలిపారు. కాలువలు ఎప్పు డు బాగుపడతాయో వేచిచూడాల్సిందే.