
కశింకోట (అనకాపల్లి): ఫిట్స్ వ్యాధి విద్యార్థి ప్రాణం తీసింది. కన్నవారికి గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ విషాద సంఘటన గొబ్బూరు గ్రామంలో చోటుచేసుకుంది. పోలవరం కాలువలో మునిగి చందక దేవికుమార్(14) చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొబ్బూరు గ్రామానికి చెందిన చందక రాము, పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు దేవికుమార్ నరసింగబిల్లి ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం గ్రామ సమీపంలోని పోలవరం కాలువ ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లాడు. అనంతరం కాలువలో దిగిన సమయంలో ఫిట్స్ వ్యాధి రావడంతో నీటిలో పడిపోయి మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్నవారు చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కుమారుడు మృతితో కన్నవారు కన్నీరుమున్నీరుగా రోదించిన తీరు స్థానికులను కలచి వేసింది. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు.. దేవికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు ఎస్సై రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment