కాలువలో పడి వ్యక్తి గల్లంతు!
Published Sun, Oct 23 2016 1:41 AM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM
తణుకు : తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురంలో 16వ నంబర్ జాతీయ రహదారి వంతెన పై నుం చి గోస్తనీ కాలువలోకి గు ర్తుతెలియని వ్యక్తి దూకి ఆ త్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే కాలువలో దూకిన వ్యక్తి వివరాలు లభ్యం కాకపోగా వంతెనపై సైకిల్‌తోపాటు చెప్పులు ఉండటం అనుమానాలకు బలం చేకూరుతోంది. శుక్రవారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో కాలువలో వ్యక్తి కొట్టుకుని వెళుతున్నట్టు గుర్తించామని కాలువ సమీపంలో నివాసముంటున్న స్థానికులు చెబుతున్నారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పట్టణ పోలీసులు చెప్పారు.
Advertisement
Advertisement