ఈతకు దిగి విద్యార్థి దుర్మరణం
Published Tue, Nov 1 2016 2:23 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM
నరసాపురం : పట్టణంలోని నరసాపురం–నిడదవోలు కాలువలో చినమామిడిపల్లి, ఆంజనేయస్వామిగుడి రేవు వద్ద స్నేహితులతో కలిసి ఈతకు దిగిన తిరుమాని నవీ¯ŒS(16) దుర్మరణం పాలయ్యాడు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనతో నవీ¯ŒS కుటుంబం విషాదంలో మునిగిపోయింది. పట్టణంలోని పొన్నపల్లికి చెందిన నవీ¯ŒS స్థానిక సూర్యా కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో మరో ఐదుగురు స్నేహితులతో కలిసి, రేవులో స్నానానికి దిగాడు. రేవుమెట్లమీద నుంచి, దూకి ఈతకొట్టే క్రమంలో నవీ¯ŒS కాలువలో మునిగిపోయినట్టుగా భావిస్తున్నారు. మునిగిపోయిన నవీ¯ŒS ఎంతసేపటికీ పైకి రాకపోవడంతో, స్నేహితులు స్థానికుల సాయంతో గాలించారు. దీంతో నవీ¯ŒS మృతదేహం లభ్యమైంది. ఈవిషయం తెలుసుకున్న నవీ¯ŒS తల్లి నాగమణి, నానమ్మ ఘటనాస్థలానికి చేరుకుని తీవ్రంగా రోదించారు. ఆడుకుంటాకని వెళ్తున్నానని చెప్పిన నవీ¯ŒS విగతజీవిగా మారడంతో వారు కుప్పకూలిపోయారు.
నవీ¯ŒSది నిరుపేద కుటుంబం. చిన్న పూరిగుడిసెలో అద్దెకు ఉంటున్నారు. తండ్రి శ్రీనివాస్ టైలరింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. తండ్రి బాధ్యత లేకుండా ఉండడంతో తల్లే ఇంటివద్ద కుట్టు అల్లికలు చేసుకుంటూ.. నవీ¯ŒSను మరో బిడ్డను చదివించుకుంటుంది. చేతికందివస్తాడనుకున్న కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో గుండెలవిసేలా రోదిస్తోంది.
Advertisement