కాలువ మింగేసింది
కాలువ మింగేసింది
Published Sun, Oct 2 2016 1:55 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
యర్నగూడెం (దేవరపల్లి) : దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద తాడిపూడి కాలువలో స్నానానికి దిగిన ఇద్దరు భవానీ దీక్షధారులు మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి.. యర్నగూడేనికి చెందిన ద్వారపూడి దుర్గారావు(20), మాధవరపు చందు (15) భవానీ దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఐదుగురు భవానీలు స్నానం చేయడానికి గ్రామ సమీపంలోని తాడిపూడి కాలువకు వెళ్లారు. కా లువలో దిగి స్నానం చేస్తుండగా ఊబిలో కూరుకుపోయి దుర్గారావు, చందు ఊపిరాడక మృతిచెందారు. మిగిలిన ముగ్గురు దీక్షధారులు గ్రామస్తులకు చెప్పడంతో వారు కాలు వ వద్దకు వెళ్లి మృతదేహాలను బయటకు తీశారు. దుర్గారావు తండ్రి రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా తాపీ పనికి వెళుతూ తల్లీచెల్లీని పోషిస్తున్నాడు. చందు కూలి పను లు చేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నాడు. ఇద్దరు యువకుల అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎస్సై సీహెచ్ ఆంజనేయులు, తహసీల్దా ర్ ఎం.అక్బర్‌హుస్సేన్ ప్రమాద స్థలానికి వెళ్లి విచారణ జరి పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
Advertisement
Advertisement