
మహిళను రక్షించి తీసుకొస్తున్న యువకులు
కర్ణాటక,రాయచూరు రూరల్: ఓ మహిళ అదుపు తప్పి వాగులో పడి కొట్టుకుపోతుండగా కొందరు యువకులు ధైర్యసాహసాలు ప్రదర్శించి నీటిలోకి దూకి ఆమెను కాపాడారు. వివరాలు.. మూడు రోజలుగా కురుస్తున్న భారీ వర్షాలతో యాదగిరి జిల్లా శహపుర తాలూకా పగలాపుర వద్ద కోయిలూరు వాగి పొంగి ప్రవహిస్తోంది. ఆశనాలకు చెందిన మహిళ, మరికొంతమంది కూలీలు శనివారం ఉదయం ఆటోలో పగలూరులోని పొలానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి ఆటోలో వస్తుండగా కోయిలూరు వాగులో నీటి ఉధృతిని చూసి డ్రైవర్ ఆటోను నిలిపివేశాడు. దీంతో కూలీలు ఒకరి చేతులు మరొకరు పట్టుకొని వాగు దాటుతుండగా నాగమ్మ(29)అనే మహిళ అదుపు తప్పి నీటిలో పడి కొట్టుకుపోయింది. దీంతో మిగతా వారు గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న యువకులు వాగులోకి దూకారు. మెడలోతు వరకు నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా ఈదుకుంటూ వెళ్లి నాగమ్మను రక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment