
లక్నో: ట్రాక్టర్ ట్రాలీ కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు చిన్నారులు సహా మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. తాజ్‌పురా ప్రాంతానికి చెందిన సుమారు 50 మంది బుధవారం సాయంత్రం రన్‌దౌల్ గ్రామంలో జరిగే మతపరమైన కార్యక్రమానికి ట్రాక్టర్‌లో బయలుదేరారు.
రెధిబోడ్కి గ్రామ సమీపంలోని కాల్వలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ పడిపోయింది. బుధవారం నాలుగు, గురువారం అయిదు మృతదేహాలను కాల్వ నుంచి బయటకు తీశారు. మృతుల్లో 5–12 ఏళ్ల మధ్య వయస్సున్న నలుగురు చిన్నారులు న్నారు. గాలింపు చర్యలు కొనసాగుతు న్నాయని అధికారులు చెప్పారు.