Tractor trolley
-
కాల్వలో పడిన ట్రాక్టర్.. 9 మంది మృతి
లక్నో: ట్రాక్టర్ ట్రాలీ కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు చిన్నారులు సహా మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. తాజ్‌పురా ప్రాంతానికి చెందిన సుమారు 50 మంది బుధవారం సాయంత్రం రన్‌దౌల్ గ్రామంలో జరిగే మతపరమైన కార్యక్రమానికి ట్రాక్టర్లో బయలుదేరారు. రెధిబోడ్కి గ్రామ సమీపంలోని కాల్వలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ పడిపోయింది. బుధవారం నాలుగు, గురువారం అయిదు మృతదేహాలను కాల్వ నుంచి బయటకు తీశారు. మృతుల్లో 5–12 ఏళ్ల మధ్య వయస్సున్న నలుగురు చిన్నారులు న్నారు. గాలింపు చర్యలు కొనసాగుతు న్నాయని అధికారులు చెప్పారు. -
దైవ దర్శనానికి వెళ్తుండగా.. పల్టీలు కొడుతూ నీట పడ్డ ట్రాక్టర్
లక్నో: కిక్కిరిసిన జనంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ బోల్తా కొట్టి నీటి కొలనులో పడిపోగా.. పది మంది దుర్మరణం పాలయ్యారు. ఉత్తర ప్రదేశ్ లక్నో శివారులోని ఇటావుంజా దగ్గర సోమవారం ఉదయం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్కువ మందిని తీసుకెళ్తున్న సమయంలో.. ఓవర్‌లోడ్ కారణం ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొడుతూ మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న నీటి కొలనులో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. స్థానికుల సాయంతో అధికారులు 37 మందిని రక్షించింది. మరో పది మంది మృతి చెందినట్లు ఐజీ లక్ష్మిసింగ్ వెల్లడించారు. మృతులంతా సీతాపూర్ అట్టారియాకు చెందిన వాళ్లుగా నిర్ధారణ అయ్యింది. నవరాత్రి సందర్భంగా ఇటావుంజాలోని ఉన్నాయ్ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలకు వెళ్తూ వీళ్లంతా ప్రమాదంలో మరణించారు. ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం రాష్ట్ర ప్రభుత్వం తరపున చెల్లించనున్నట్లు ప్రకటించారు. मुख्यमंत्री जी ने दिवंगत के परिजनों को ₹4 लाख की राहत राशि प्रदान करने के निर्देश दिए हैं। उन्होंने शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है और घायलों के शीघ्र स्वस्थ होने की कामना करते हुए उनके उपचार की समुचित व्यवस्था करने के निर्देश दिए हैं। — CM Office, GoUP (@CMOfficeUP) September 26, 2022 -
రేయ్! రేయ్!.. తప్పుకోండిరా బాబు... మీదకు వచ్చేస్తోంది..!!
ఒక్కోసారి అనుహ్యంగా జరిగే ప్రమాదాలు చాలా భయంకరంగా ఉంటాయి. అయితే, అటువంటి ఘటనల్లో ఎవ్వరికీ ఏం నష్టం జరగకపోతే పర్వాలేదు గానీ ఊహించని విధంగా ప్రాణం నష్టం సంభవిస్తే మాత్రం పరిస్థితి మరింత భయానకంగా మారుతుంది. తాజాగా అటువంటి ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (చదవండి: రాంచీలో బిర్సా ముండా స్మారకాన్ని ప్రారంభించిన మోదీ) వీడియో ప్రకారం.. ఏమైందో తెలియదు గానీ, చెరకు లోడ్‌తో ఉన్న ట్రాక్టర్ ట్రాలీ భాగం ఒక్కసారిగా ప్రజల మీదకు దూసుకొస్తోంది. ఊహించని ఘటనతో కంగుతిన్న అక్కడున్నవారు అప్రమత్తమై తప్పుకోండి.. తప్పుకోండి అని అరవడం మొదలెట్టారు. మరికొంతమంది అలవాటులో పొరపాటుగానో.. లేక నిజంగానే అంత బలమైన, వేగంతో పరుగెడుతున్న ట్రాలీని ఆపగలమనే భ్రమతోనో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక లోడ్‌తో ఉన్న ట్రాలీ జనం మధ్యగుండా వేగంగా వెనక్కి వెళ్లి ఓ కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగింది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. విషయం ఏంటంటే.. ఓ ట్రాక్టర్ చెరకు లోడ్‌తో వచ్చింది. దానిని అన్లోడ్ చేద్దామని.. ట్రాలీని ఇంజన్ భాగం నుంచి వేరు చేశారు. అయితే, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ట్రాలీని ఇంజన్ నుంచి విడదీయడంతో అది ఒక్కసారిగా వెనక్కి లగెత్తింది. ఇక్కడ ఫన్నీ విషయం ఏంటంటే.. అప్పటి వరకు అక్కడ చీకటి కమ్ముకోగా.. ట్రాలీ ఢీకొట్టడంతో స్తంభానికి ఉన్న లైట్ ఒక్కసారిగా వెలిగింది. "ఏవిధంగా ట్రాలీని ఆపగలమనుకుని పరుగెడుతున్నారంటూ" కొందరు నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్లు చేశారు. (చదవండి: జిమ్‌లో అసభ్య ప్రవర్తన... టిక్‌టాక్ షేర్ చేయడంతో పరార్!!) जान माल का नुकसान तो नहीं हुआ लेकिन दूसरा बल्ब चालू हो गया 🤣🤣😁😅😀 pic.twitter.com/wIf2nhW1jM — Doctor Gulati L L B (@DRGulati80) November 12, 2021 -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉన్నవో : ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో అయిదుగురు దుర్మరణం చెందగా, మరో 30మంది గాయపడ్డారు. ఇవాళ ఉదయం లక్నో- ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ట్రాలీపై బస్సు దూసుకెళ్లడంతో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
వృద్ధురాలి మీదినుంచి వెళ్లిన ట్రాక్టర్.. కేతేపల్లి, న్యూస్‌లైన్ : ట్రాక్టర్ ట్రాలీ కింద నిద్రిస్తున్న వృద్ధురాలి మీదుగా అదే ట్రాక్టర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన చెర్కుపల్లి ఐకేపీ కేం ద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నిమ్మనగోటి రాములమ్మ(75) వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులనుంచి ధాన్యం యాచించేందుకు మంగళవారం ఐకేపీ కేంద్రానికి వెళ్లింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ధాన్యం రాశుల పక్కనే నిలిపి ఉన్న ట్రాక్టరుట్రాలీ కింద నీడలో విశ్రమించింది. గమనించని ట్రాక్టరు డ్రైవరు ఇంజిన్ స్టార్ట్ చేసి వెనక్కిపోనిచ్చాడు. రాములమ్మకు వినికిడి లోపం ఉండడంతో ట్రాక్టరు స్టార్టు అయిన విషయం తెలియక అలాగే ఉండిపోయింది. దీంతో రాములమ్మ తలమీదుగా ట్రాక్టర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మృతురాలి కుటుంబీకులు, గ్రామస్తులు అందించిన సమాచారంతో కేతేపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. బైక్ పైనుంచి పడి.. కోదాడ రూరల్, న్యూస్‌లైన్ : బైక్ పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మండల పరిధిలోని తొగర్రాయి సబ్‌స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన చిత్తలూరి కిరణ్‌కుమార్ (36) తన జేసీబీల పనినిమిత్తం కోదాడకు వచ్చాడు. పని ముగిసేసరికి రాత్రి అయ్యింది. తిరిగి బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యలోని తొగర్రాయి సబ్‌స్టేషన్ సమీపంలో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో కిరణ్‌కుమార్ తలకు తీవ్రగాయాలయ్యాయి. రోడ్డువెంట వెళ్తున్న వారు గమనించి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది సంఘటనస్థలానికి చేరుకుని అతన్ని కోదాడకు తరలించి చికిత్స చేస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు హెడ్ కానిస్టేబుల్ సత్యం తెలిపారు.