టేకులపల్లి (భద్రాద్రి కొత్తగూ డెం): పంట పొలాలకు వెళ్లాలం టే ఇలా రోజూ 50 అడుగుల లోతులో ఉన్న కాల్వను ఎక్కి దిగాల్సిందే. రెండు నెలలుగా మహిళలతో పాటు రైతులు ఇలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాల్వ దాటుతున్నా.. సింగరేణి అధికారులు పట్టించుకున్న పాపానపోవటం లేదు. ఒక వేళ ఇలా కాల్వ దాటడం ఇష్టంలేని వాళ్లు రెండు కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కొప్పురాయి పంచాయతీ లక్ష్మీపురం గ్రామ సమీపంలో ఇల్లెందు ఏరియాలోని కేఓసీ పిట్–1 మైనింగ్ పనుల్లో భాగంగా పారికలవాగు మళ్లింపు పనులు చేపట్టారు. గ్రామ సమీపంలోనే రైతుల పొలాల నుంచే కాల్వ తవ్వారు. అయితే, పనులను మధ్యలోనే వదిలేశారు.
Comments
Please login to add a commentAdd a comment