Mining tasks
-
అదుపు తప్పితే.. అంతే..!
టేకులపల్లి (భద్రాద్రి కొత్తగూ డెం): పంట పొలాలకు వెళ్లాలం టే ఇలా రోజూ 50 అడుగుల లోతులో ఉన్న కాల్వను ఎక్కి దిగాల్సిందే. రెండు నెలలుగా మహిళలతో పాటు రైతులు ఇలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాల్వ దాటుతున్నా.. సింగరేణి అధికారులు పట్టించుకున్న పాపానపోవటం లేదు. ఒక వేళ ఇలా కాల్వ దాటడం ఇష్టంలేని వాళ్లు రెండు కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కొప్పురాయి పంచాయతీ లక్ష్మీపురం గ్రామ సమీపంలో ఇల్లెందు ఏరియాలోని కేఓసీ పిట్–1 మైనింగ్ పనుల్లో భాగంగా పారికలవాగు మళ్లింపు పనులు చేపట్టారు. గ్రామ సమీపంలోనే రైతుల పొలాల నుంచే కాల్వ తవ్వారు. అయితే, పనులను మధ్యలోనే వదిలేశారు. -
మళ్లీ తెరపైకి మైనింగ్ జోన్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : మైనింగ్ జోన్ మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రజాపోరాటాలు, రాజకీయ పార్టీల ఒత్తిడితో గతంలో మైనింగ్ జోన్ ఏర్పాటు విషయం సద్దుమణిగింది. యాచారం, మంచాల, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో పెద్దఎత్తున గుట్టలు ఉన్న ప్రాంతాలను పూర్తిగా మైనింగ్‌జోన్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతంలో భావించింది. దాదాపు 1.5 లక్షల ఎకరాల్లో ఈ జోన్ ఏర్పాటుచేస్తే ఖజానాకు సైతం భారీగా ఆదాయం వస్తుందని భావించిన సర్కారు.. ఆ మేరకు గతంలో భూములను గుర్తించింది. కానీ స్థానికంగా అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో మైనింగ్ లీజులు పొందిన హక్కుదారులు తిరిగి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో తలొగ్గిన పాలకులు తిరిగి మైనింగ్ జోన్‌కు సంబంధించిన ఫైళ్ల దుమ్ము దులపాలని ఆదేశించారు. రెండు రోజుల్లో ఫైళ్లు పంపాలి.. ప్రస్తుతం తాండూరు డివిజన్ పరిధిలో మైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ డివిజన్లోని యాచారం, కందుకూరు, మహేశ్వరం, మంచాల మండలాల్లోని లక్ష ఎకరాలను మైనింగ్‌జోన్‌గా గుర్తించారు. అంతేకాకుండా వాటి లీజులను కాంట్రాక్టర్లకు సైతం కట్టబెట్టారు. అయితే మైనింగ్ జోన్ ఏర్పాటుతో దుమ్ము రేగుతుందని, తద్వారా సాగు ఆందోళనకరమవ్వడంతోపాటు పర్యవరణ కాలుష్యం పెరిగి జనజీవనానికి విఘాతం కలుగుతుందని గతంలో అన్ని పక్షాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. దీంతో అప్పట్లో మైనింగ్‌జోన్ ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్ పడగా.. ప్రస్తుత ప్రభుత్వం ఈ ఫైళ్లకు సంబంధించి సమాచారాన్ని రెండ్రోజుల్లో సమర్పించాలని స్పష్టం చేసింది. దీంతో ఆయా మండల తహసీల్దార్లకు వివరాలు పంపాల్సిందిగా జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు అందుకు సంబంధించిన ఫైళ్లను యంత్రాంగానికి సమర్పించే పనిలో నిమగ్నమయ్యారు. -
సర్వే సాగనివ్వం
నవాబుపేట: ‘మా భూముల సమీపంలో ఎలాంటి మైనింగ్ పనులు చేపట్టవద్దు.. కాదని ఎవరు వచ్చినా అడ్డుకుంటాం’ అని రైతులు స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలోని యావాపూర్‌లో మైనింగ్ సర్వేను అడ్డుకున్నారు. మండల పరిధిలోని ఆర్కతల పంచాయతీ అనుబంధ గ్రామమైన యావాపూర్‌లోని 53 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిలో శుక్రవారం మైనింగ్ వ్యాపారి నరేష్, ప్రభుత్వ సర్వేయర్ సుధాకర్‌ను, మరో ప్రైవేటు సర్వేయర్‌ని తీసుకొని సర్వే చేయించడానికి వచ్చారు. విషయం తెలుసుకున్న యావాపూర్ పలువురు రైతులు అక్కడికి చేరుకున్నారు. ఇక్కడేం చేస్తున్నారంటూ వారిని ప్రశ్నించగా.. తాము 2010లో ఇక్కడ మైనింగ్ వ్యాపారం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నామని వారు తెలిపారు. మైనింగ్ కోసం సర్వే చేస్తున్నామని వ్యాపారి నరేష్ రైతులకు చెప్పారు. దీంతో రైతులు.. ఇక్కడ ఎలాంటి మైనింగ్ తవ్వకాలను జరపవద్దని, ఇక్కడి ప్రభుత్వ భూమి చుట్టూ తమకు అసైన్మెంట్ చేసిన భూమి ఉందన్నారు. తవ్వకాలు జరపడం వల్ల తమ పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని, తమ పొలాలు దాటి ఈ భూమిలోకి రావాల్సి ఉంటుందన్నారు. అందుకు తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు. సర్వే పనులను నిలిపివేయించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ యాదయ్య ఘటనా స్థలానికి వచ్చారు. రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి సర్వే పనులు నిలిపివేయాలని మైనింగ్ వ్యాపారులకు సూచించారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. జేసీ ఎంవీ రెడ్డి ఆర్కతలకు వచ్చారనే విషయం తెలుసుకున్న రైతులు నేరుగా ఆ గ్రామానికి వె ళ్లారు. మైనింగ్ సర్వేతో పాటు, మైనింగ్ దరఖాస్తులను రద్దు చేయాలని ఆయనను కోరాారు. రైతుల విజ్ఞప్తికి స్పందించిన జేసీ.. సర్వేను, మైనింగ్ దర ఖాస్తులు తదితర విషయాలపై తనకు నివేదిక అందజేయాలని తహసీల్దార్ యాదయ్యను ఆదేశించారు.