వైభవంగా గర్నిమిట్ట ఎల్లమ్మ జాతర  | Garnimitta Yallamma Jatara Held With Glory In Chittoor District | Sakshi
Sakshi News home page

వైభవంగా గర్నిమిట్ట ఎల్లమ్మ జాతర 

Published Tue, May 24 2022 10:41 PM | Last Updated on Tue, May 24 2022 10:41 PM

Garnimitta Yallamma Jatara Held With Glory In Chittoor District - Sakshi

కేవీపల్లె: ఆలయ ప్రదక్షిణలు చేస్తున్న చాందినీబండ్లు 

కేవీపల్లె: మండలంలోని గర్నిమిట్ట గ్రామదేవత ఎల్లమ్మ జాతర వైభవంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి మహిళలు బోనాలు తెచ్చి అమ్మవారికి స మర్పించారు. మండలం నుంచే గాక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చాందినీ బండ్లు, బళ్లారి డ్రమ్మ్, చెక్క భజన లు, కోలాటాలు, పిల్లనగ్రోవి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సోమవారం  చాందినీబండ్లతో  ప్రదక్షిణలు చేశారు.      

ముగిసిన సత్యమ్మ జాతర 
కలికిరి: పట్టణంలోని రామ్‌నగర్‌ కాలనీలో ఉన్న సత్యమ్మ ఆలయంలో జరుగుతున్న జాతర సోమవారంతో ముగిసింది.  ఆదివారం రాత్రి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి దీలు, బోనా లు సమర్పించారు. అన్నదానం చేశారు.   

ఘనంగా ఊంజల్‌ సేవ 
వాల్మీకిపురం: గ్రామదేవత నల్లవీర గంగాభవానీ అమ్మవారికి సోమవారం ఊంజల్‌ సేవ వైభవంగా నిర్వహించారు.  కమిటీ సభ్యులు రాంకుమార్‌ రెడ్డి, రమణారెడ్డి, బలరాం, మహేష్, రవి, జనాస్వామి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement