yallamma
-
వైభవంగా గర్నిమిట్ట ఎల్లమ్మ జాతర
కేవీపల్లె: మండలంలోని గర్నిమిట్ట గ్రామదేవత ఎల్లమ్మ జాతర వైభవంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి మహిళలు బోనాలు తెచ్చి అమ్మవారికి స మర్పించారు. మండలం నుంచే గాక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చాందినీ బండ్లు, బళ్లారి డ్రమ్మ్, చెక్క భజన లు, కోలాటాలు, పిల్లనగ్రోవి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సోమవారం చాందినీబండ్లతో ప్రదక్షిణలు చేశారు. ముగిసిన సత్యమ్మ జాతర కలికిరి: పట్టణంలోని రామ్‌నగర్ కాలనీలో ఉన్న సత్యమ్మ ఆలయంలో జరుగుతున్న జాతర సోమవారంతో ముగిసింది. ఆదివారం రాత్రి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి దీలు, బోనా లు సమర్పించారు. అన్నదానం చేశారు. ఘనంగా ఊంజల్ సేవ వాల్మీకిపురం: గ్రామదేవత నల్లవీర గంగాభవానీ అమ్మవారికి సోమవారం ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. కమిటీ సభ్యులు రాంకుమార్ రెడ్డి, రమణారెడ్డి, బలరాం, మహేష్, రవి, జనాస్వామి పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
గార్లదిన్నె (శింగనమల): గార్లదిన్నె మండలం పి.కొత్తపల్లి సమీపంలో యల్లమ్మ అనే వివాహిత సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషపుద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కాసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాలల్సి ఉంది. -
ఘనంగా యల్లమ్మ విగ్రహ ప్రతిష్ట
హిందూపురం రూరల్ : మండలంలోని కె.బసవనపల్లి గ్రా మంలో నూతనంగా నిర్మించిన యల్లమ్మదేవి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. ఉదయం యల్లమ్మదేవి ఆలయం ఎదుట చండీహోమం చే పట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అభిషేకార్చనలు, బలిహారణ, మహాపూర్ణహారతి, మహామంగళహారతి తదితర పూజ లు నిర్వహించారు. అనంతరం దేవతా విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా గ్రామంలో జ్యోతు ల మహోత్సవం చేపట్టారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్, మండల కన్వీనర్ బసిరెడ్డి తదితర నాయకులు అమ్మవారి ఆలయాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. -
ఘనంగా గంజి ఉత్సవం
హిందూపురం రూరల్ / అర్బన్: హిందూపురం రూరల్ మండలంలోని కిరికెర గ్రామంలో వెలసిన ఓమ్‌శక్తి అమ్మవారి గంజి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏటా శ్రావణమాసం మొదటి ఆదివారం అయ్యప్ప ఆలయంలో రాగి గంజి కాచి వేప ఆకులతో అలంకరించి ఓమ్‌శక్తి అమ్మవారిని పల్లకీలో గ్రామ పుర వీధులగుండా ఊరేగింపుగా తీసుకువస్తారు. అనంతరం ఓమ్‌శక్తి ఆలయంలో రాగి గంజిని భక్తులకు నైవేద్యంగా పంపిణీ చేస్తారని వారు తెలిపారు. ఆలయ పూజారులు అమ్మవారికి ఉదయం విశేష అలంకరణలతో కుంకుమార్చన, అభిషేకార్చన నిర్వహించారు. గంజి ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఎర్రని వస్త్రాలు ధరించి గ్రామోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.