సాక్షి, వరంగల్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర కోసం రూ.75కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మహాజాతరలో రోడ్లు, విద్యుత్, తాగునీటి సరఫరా, స్నానాల గదుల ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. రెండేళ్లకోసారి నిర్వహించే జాతర సందర్భంగా ఇటీవల రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతర నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.110కోట్లు అవసరం ఉంటాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం రూ.75కోట్లు విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల క్రితం నిర్వహించిన జాతరకు సైతం ప్రభుత్వం రూ.75కోట్లు కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment