sammkka-saralamma
-
సమ్మక్క చరిత్ర తెలియాలంటే.. దీన్ని డీకోడ్ చేయాల్సిందే
సమ్మక్క, సారలమ్మ జాతర గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. సమ్మక్క కారణజన్మురాలని.. పుట్టుకతోనే మహిమలు చూపేదని కోయపురాణం చెబుతుంది. కాకతీయులతో పోరాడి సమ్మక్క వీరమరణం పొందింది అని చరిత్రకారుల అభిప్రాయం. సమ్మక్క దైవాంశ సంభూతురాలని భక్తుల విశ్వాసం. ఇంతకీ సమ్మక్క చరిత్రకు సంబంధించిన వివరాలు ఎక్కడున్నాయి? జాతర సందర్భంగా గోవిందరాజులు, పగిడిద్దరాజులను మేడారం తీసుకువచ్చే పూజారులు ప్రత్యేకంగా తయారు చేసిన జెండాలను మోసుకుంటూ వస్తారు. గోవిందరాజులు, పగిడిద్దరాజులకు వేర్వేరుగా ఈ జెండాలు ఉన్నాయి. ఇలాంటి జెండాలే సమ్మక్క, సారలమ్మలకు ఉన్నాయి. ఆ జెండాలు వందల ఏళ్ల నాటి విషయాలను తమలో దాచుకున్నాయి. సమ్మక్క చరిత్ర పూర్తిగా లిఖితంగా ఎక్కడా లభించలేదు . అయితే సమ్మక్కతో పాటు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల చరిత్ర మరో రూపంలో నిక్షిప్తమై ఉంది. ఈ చరిత్రను పటం రూపంలో నిక్షిప్తమయ్యిందని ఆదివాసీలు చెబుతుంటారు. అనాదిగా కోయలు, ఆదివాసీలకు వేర్వేరు భాషలు ఉన్నాయి. అయితే చాలా కోయ భాషలకు లిపి లేదు. దీంతో పురాతన పద్దతి అనుసరించి బొమ్మల రూపంలో చరిత్రను నిక్షిప్తం చేశారు. బొమ్మల రూపంలో చరిత్రను.. ఆనాటి పరిస్థితులను నిక్షిప్తం చేయడం ఎప్పటి నుంచో అమల్లో ఉన్న పద్దతి. ప్రాచీన ఈజిప్టులు ఇదే పద్దతిని ఫాలో అయ్యారు. ఈజిప్టు చరిత్రకు సంబంధించిన అనేక అంశాలు ఈ బొమ్మల లిపిలోనే మనకు లభ్యమయ్యాయి. వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా పేరొందిన మధ్యప్రదేశ్‌లోని భీమ్బెట్కా దగ్గర ఈ తరహా బొమ్మల లిపి రూపంలో చరిత్ర అందుబాటులో ఉంది. ఇంచుమించు ఇదే పద్దతిలో ఆదివాసీ దేవతల చరిత్ర లిఖించబడింది. ఎర్రగా త్రిభుజాకారంలో తయారు చేసిన ఈ జెండాలనే వనదేవతల చరిత్ర ఉంది. సమక్క, సారలమ్మల పూర్వీకులు, ప్రకృతితో వారికి ఉన్న సంబంధం అంతా ఇక్కడ బొమ్మల రూపంలో వివరించి ఉంటుంది. ఒక్కో ఆదివాసీ దేవతకు ఒక్కో రూపంలో ఈ జెండాలు ఉన్నాయి. ఈ జెండాలో ఉన్న బొమ్మల ఆధారంగా డోలీలు సమ్మక్క కథను మౌఖికంగా చెబుతారు. సమక్క, సారలమ్మలతో పాటు ఇతర ఆదివాసీ దేవతలకు సంబంధించి జెండాల గురించి చాలినంత పరిశోధన జరగలేదు. వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఈ జెండాలోని బొమ్మల లిపిపై చరిత్రకారులు పరిశోధనలు చేయాల్సి ఉంది. ఈ జెండాలోని అంశాలు, వాటి ఆధారంగా చెబుతున్న మౌఖిక కథలను డీకోడ్ చేస్తే ఆదివాసీ దేవతలకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి -
మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి!
ఆదివాసీ అస్తిత్వం మేడారం జాతర. వారి పోరాటానికి చిహ్నం. అది జాతర కాదు, ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీక. గిరిజన స్వయంపాలనకు దిక్సూచి అయిన మేడారం జాతర మొదలైంది. అమ్మతల్లుల జాతరలో ఆదివాసులే కాదు, సకల జనులూ భక్తిపారవశ్యంలో మునిగితేలుతారు. జాతర నాలుగు రోజులూ... సత్తెంగల సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లిస్తూ... సంప్రదాయ వంటకాలను నైవేద్యంగా పెడుతూ... మరో లోకాన్ని సృష్టిస్తారు. ఇటువంటి జనజాతరకు ఎప్పటి నుంచో జాతీయ హోదా కల్పించాలని భక్తులూ, రాష్ట్రప్రభుత్వం ఎన్నో రోజుల నుంచి కోరుతున్నది. కానీ ఆ కల ఇంకా నెరవేరనేలేదు. దేశంలో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర రానేవచ్చింది. నేటి నుంచి ఫిబ్రవరి 19 వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరలో... వివిధ రకాల పూజా ప్రక్రియలు, ఆదివాసుల ప్రత్యేక వస్త్ర ధారణ వంటి అంశాలు అంతర్జాతీయ ఖ్యాతిని పొందాయి. ములుగు జిల్లా, తాడ్వాయి మండలం... మేడారం గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన ఈ వేడుకకు జాతీయ హోదా ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రానికి ఇప్పటి వరకు చాలాసార్లు ప్రతిపాదనలు వెళ్ళినా ఇంతవరకు అది సాకారం కాలేదు. స్థానిక ఆదివాసీల నమ్మకం ప్రకారం... సమ్మక్కను కోయల్లో చందా వంశస్థుల ఆడపడుచుగా భావిస్తారు. ఆమె బయ్యక్కపేటలో జన్మించింది. ఈడు వచ్చే కొలది ఆమె తాను ఇంటిలో ఉండలేనని, విడిగా ఉంటానని చెబుతూ వచ్చింది. చివరికి అక్కడి దట్టమైన అడవుల్లో ఉన్న ఒక కొండపైకి వెళ్లి దాన్నే తన నివాస స్థలంగా ఏర్పాటు చేసుకుందని స్థానికులు చెబుతారు. సమ్మక్క కొండ దిగి వచ్చి రోజూ స్నానం చేసే ఒక కొలను కూడా కొండ దగ్గరలో ఉందనీ, దాన్ని ‘జలకం బావి’ అని పిలుస్తామని వాళ్లు చెబుతున్నారు. మొదటలో బయ్యక్క పేటలోనే సమ్మక్క జాతర జరిగేది. కొన్ని కారణాల వల్ల అది మేడారానికి మారింది. మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంలో మొదలయ్యే సమ్మక్క జాతర నాలుగు రోజులు జరుగుతుంది. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను, కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకువస్తారు. రెండవ రోజున మేడారం సమీపం లోని చిలకలగుట్ట నుంచి సమ్మక్కను కుంకుమ భరిణె రూపంలో గద్దెపైకి తీసుకొస్తారు. మూడో రోజు అమ్మవార్లకు భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. తమ కోరికలు తీర్చమని భక్తులు బెల్లం (బంగారం)ను నైవేద్యంగా సమర్పించుకుంటారు. నాలుగవ రోజు పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వన ప్రవేశం చేయిస్తారు. అంటే వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి భక్తి శ్రద్ధలతో మళ్లీ ఆదివాసీ కోయలు చేరుస్తారు. ఇలా దీంతో జాతర ముగుస్తుంది. ఎంతో చరిత్ర, నేపథ్యం కలిగిన సమ్మక్క–సారలమ్మ జాతరను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1996లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2014లో ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా జాతర జరుపుతున్నది. ఈ జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 332.71 కోట్ల నిధులను కేటా యించింది. ఈ ఏడాది రూ.75 కోట్ల నిధులు కేటాయించి రవాణా, త్రాగునీరు, భద్రతా చర్యలు వైద్య సదుపాయాలు తదితర సదుపాయాల కోసం 21 ప్రభుత్వ శాఖలకు నిధులు కేటాయించింది. (చదవండి: పరాయీకరణ దిశలో మేడారం జాతర) రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఆరు ప్రధాన రహదారుల ద్వారా ఈ జాతరకు 1 కోటి 30 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక మంది భక్తులు హాజరయ్యే పండుగ ఇది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఈ) ద్వారా జాతరకు ఎంత మంది వచ్చారో 99 శాతం కచ్చితత్వంతో తెలుసుకుంటారు. దేశంలో ఏ ఉత్సవంలోనూ వినియోగించని విధంగా కృత్రిమ మేథా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి లక్షలాది మంది భక్తులకు అసౌకర్యం కలగకుండా, తొక్కిసలాట జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి ఏర్పాట్లు చేస్తుంది. ఇంతటి చరిత్ర, నేపథ్యం కలిగిన మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రతిపాదన చేసి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. గత జాతరలో ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండా ఈ మహా జాతర ప్రాముఖ్యత గురించి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి జాతీయ హోదా ఇప్పిస్తానని వాగ్దానం చేశారు. కానీ అది మాటలకే పరిమితమైంది కానీ చేతలకు నోచుకోలేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ మహా జాతరకు జాతీయ హోదా కల్పించి నిధులు విడుదల చేస్తే జాతర ప్రాశస్త్యాన్ని ప్రపంచం గుర్తిస్తుంది. ఆ తర్వాత యునెస్కో గుర్తింపునకూ మర్గం సుగమం అవుతుంది. - అంకం నరేశ్ వ్యాసకర్త ఉపాధ్యాయుడు -
మేడారంలో ‘గుడిమెలిగె’
సాక్షి, ఎస్ఎస్ తాడ్వాయి(వరంగల్): మేడారం సమ్మక్క–సారలమ్మల మహాజాతర పూజాకార్యక్రమాలు బుధవారం జరగనున్న గుడిమెలిగె పండుగతో ఆరంభం కానున్నాయి. ఈ పండుగ నిర్వహించేందుకు పూజారులు మంగళవారం సాయంత్రంనుంచి సిద్ధమయ్యారు. వచ్చే బుధవారం (9న) మండమెలిగె పండుగకు వారానికి ముందుగా గుడిమెలిగె పండుగ నిర్వహించడం ఆనవాయితీ. మేడారంలోని సమ్మక్క గుడి పూర్వకాలంలో గుడిసెతో ఉండేది. గుడిసెపై కొత్త గడ్డి కప్పి, పందిళ్లు వేసేది. సమ్మక్క గుడి భవనం నిర్మించడంతో పూజారులు సంప్రదాయంగా బుధవారం ఉదయాన్నే సమ్మక్క గుడిని శుద్ధిచేసి ముగ్గులతో అలంకరిస్తారు. అడవినుంచి సేకరించిన ఎట్టిగడ్డిని గుడిపై ఈశాన్య దిశలో పెడతారు. గుడిమెలిగె పండుగ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. నేటి గుడిమెలిగె పండుగతో మహాజాతరకు అంకురార్పణ జరిగినట్లుగానే భావించాలి. కన్నెపల్లి సారలమ్మ గుడిలో కూడా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పూజారులు సిద్ధం గుడిమెలిగె పండుగకు పూజారులు సిద్ధమయ్యారు. మంగళవారం సాయంత్రం సమ్మక్క పూజారులు సమావేశమై పండుగ కార్యక్రమాల నిర్వహణపై చర్చించుకున్నారు. ఉదయాన్నే పూజారులు తలస్నానాలు అచరించి అడవికి వెళ్లి ఎట్టిగడ్డిని తీసుకురానున్నారు. గుడిమెలిగె సందర్భంగా భక్తులు కూడా వేలాది మంది తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. పూజా కార్యక్రమాలన్నింటినీ సమ్మక్క పూజారులు సిద్దబోయిన మునిందర్, కొక్కర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్య, దూపగడ్డ నాగేశ్వర్రావు, బొక్కెన్న, సిద్దబోయిన లక్ష్మణ రావు, సిద్దబోయిన మహేష్, పూజారులు సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, తదితరులు నిర్వహించనున్నారు. చదవండిః ‘పద్మశ్రీ’కి ఎంపికైన రామచంద్రయ్యకు కేసీఆర్ సర్కార్ బంపరాఫర్ -
Sammakka Saralamma: వచ్చే ఏడాది మహాజాతరకు రూ. 75 కోట్లు
సాక్షి, వరంగల్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర కోసం రూ.75కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మహాజాతరలో రోడ్లు, విద్యుత్, తాగునీటి సరఫరా, స్నానాల గదుల ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. రెండేళ్లకోసారి నిర్వహించే జాతర సందర్భంగా ఇటీవల రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.110కోట్లు అవసరం ఉంటాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం రూ.75కోట్లు విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల క్రితం నిర్వహించిన జాతరకు సైతం ప్రభుత్వం రూ.75కోట్లు కేటాయించింది. -
కోటి దాటిన మొక్కులు
మేడారం.. జనసంద్రం ఒక్కరోజే యాభైలక్షల మంది దర్శనం మేడారం నుంచి సాక్షి ప్రతినిధి: సమ్మక్క, సారలమ్మ నామస్మరణతో మేడారం ఉప్పొంగింది. ‘సమ్మక్క కో... సారక్క కో’ అంటూ గద్దెల ప్రాంగణం మార్మోగింది. శివసత్తుల పూనకాలతో దద్దరిల్లింది. చీర, సారె, నిలువెత్తు బంగారం(బెల్లం), ఎదుర్కోళ్లు, ఒడి బియ్యం, కొబ్బరి కాయలు... తీరొక్క రూపాల్లో వనదేవతలకు మనసారా మొ క్కులు చెల్లించుకున్నారు. అమ్మల ప్రసాదం(బెల్లం) కోసం భక్తులు పోటీపడ్డారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవాదాయ శాఖ వారు గద్దెల ప్రాంగణంలో కాకుండా బయటికి వెళ్లే దారిలో వీటిని భక్తులకు అందించారు. పవిత్రమైన మాఘశుద్ధ పౌర్ణమి(సమ్మక్కల పున్నము) రోజున వనదేవుళ్లు... సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరడంతో దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం ఉదయం నుంచే క్యూలైన్లు, గద్దెల పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కోటి 30 లక్షల మంది దర్శనం: ఈసారి జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. అయితే జాతర ముగిసేందుకు శనివారం వరకు సమయం ఉండగా, శుక్రవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది మొక్కులు చెల్లించుకోగా, ఇప్పటివరకు ఈ సంఖ్య కోటికి చేరినట్లు అధికారులు అంచనా వేశారు. అంతకుముందు గురువారం వరకు ముందస్తు మొక్కులతో కలిసి 80 లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యంగా సమ్మక్క-సారలమ్మలిద్దరు గద్దెలపై కొలువై ఉండడంతో శుక్రవారం దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మనరాష్ట్రంతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు కూడా మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్లలో భక్తుల ఇబ్బందులు: భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో క్యూలైన్లలో పలుమార్లు తోపులాట జరిగింది. సాధారణ భక్తులకు దర్శనం 6 గంటల వరకు పట్టింది. రాత్రి వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. క్యూలైన్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో మహిళా భక్తులు ఇబ్బంది పడ్డారు. పోలీసుల దురుసు ప్రవర్తనతో భక్తుల్లో ఆగ్రహం పెల్లుబికింది. మరికొందరకు భక్తులు సర్వదర్శనం బారికేడ్లను తొలగించి వీఐపీ దర్శనం క్యూలైన్ల వైపు వెళ్లారు. సాధారణ భక్తుల నిరసనతో వీఐపీ, ప్రత్యేక దర్శనాలను అధికారులు నిలిపివేశారు. ఆఖరికి ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి సైతం తల్లుల దర్శనం చేసుకున్న తర్వాత గద్దెల ప్రాంగణం నుంచి బయటకు వెళ్లేందుకు రెండు గంటల సేపు వేచి చూడాల్సి వచ్చింది. జాతరలో ప్రమాదవశాత్తు పోలీసుల తూటా పేలింది. ఈ ఘటనలో ములుగు మండలం అడవి మల్లంపల్లికి చెందిన ఆర్షం కొమురమ్మ(78)కు గాయాలయ్యాయి.