జాతరలో అపశృతి.. బాలుడి మృతి | 1 children died in ysr kadapa distirict | Sakshi
Sakshi News home page

జాతరలో అపశృతి.. బాలుడి మృతి

Published Thu, Apr 30 2015 11:02 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

1 children died in ysr kadapa distirict

కడప: వైఎస్సార్ జిల్లాలోని నందలూరు మండలం చెన్నయ్యగారిపల్లె గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన జాతరలో విషాదం చోటుచేసుకుంది. సీతారాముల కళ్యాణ అనంతరం స్వామివారి విగ్రహాలను ఊరేగింపుగా గ్రామ వీధుల్లో తిప్పతున్న సమయంలో అపశృతి దొర్లింది. ఊరేగింపులో భాగంగా ఏర్పాటు చేసిన జనరేటర్ నుంచి వచ్చిన పొగతో ఉక్కిరి బిక్కిరై గ్రామానికి చెందిన గణేష్(7) అనే బాలుడు మృతి చెందాడు. ఇతనితో పాటు మరో బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. అస్వస్థతకు గురైన బాలున్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement