
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరిలో టైప్ రైటింగ్, షార్ట్‌హ్యాండ్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించనుందని తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్‌రైటింగ్, షార్ట్ హ్యాండ్ అండ్ కంప్యూటర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాలిగ సతీష్‌బాబు తెలిపారు. పరీక్షలను నిర్వహించాలని కోరుతూ గురువారం విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, కార్యదర్శి సి.శ్రీనాథ్‌ను ఆయన కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 22, 23 తేదీల్లో టైప్ రైటింగ్, 29, 30 తేదీల్లో షార్ట్‌హ్యాండ్ పరీక్షలను నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారని సతీష్‌బాబు చెప్పారు. పరీక్ష ఫీజు వచ్చే నెల 29 వరకు పొడిగించారని, ప్రీమియం తత్కాల్ కింద రూ. 5వేలు ఫీజు చెల్లించి పరీక్షకు ముందు రోజు వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారని వివరించారు.