పోలీసుల అదుపులో అవంతి సోద‌రుడు | Total Number Of Accused In Hemant Murder Case Rises To 21 | Sakshi
Sakshi News home page

హ‌త్య‌కేసులో 21కి పెరిగిన నిందితుల సంఖ్య

Published Mon, Sep 28 2020 2:21 PM | Last Updated on Mon, Sep 28 2020 2:28 PM

Total Number Of Accused In Hemant Murder Case  Rises  To 21 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  హేమంత్‌ కుమార్‌ హత్య కేసులో  మ‌రో ఏడుగురు కీల‌క నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో మొత్తం  నిందితుల సంఖ్య 21కి చేరింది. వీరిలో అవంతి సోద‌రుడు అశీష్ రెడ్డి, సందీప్‌రెడ్డి స‌హా ఎ5 కృష్ణ, ఎ6 బాషా ఎ17, జగన్ ఎ18 సయ్యద్‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎ1 యుగంధ‌ర్ రెడ్డి కృష్ణ‌తో హ‌త్య‌కు సంబంధించి ఒప్పందం చేసుకున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. హ‌త్య త‌ర్వాత జగన్, సయ్యద్ నిందితుల‌కు స‌హ‌క‌రించిన‌ట్లు పేర్కొన్నారు.  తన భర్త హత్యలో సందీప్ రెడ్డి గూడూరు, ఆశిష్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని అవంతి ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. గతంలో సందీప్‌రెడ్డి హేమంత్‌ తండ్రిపై బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె తెలిపారు. ఇక మ‌రికాసేప‌ట్లో హేమంత్ సోద‌రుడు, అవంతి సైబ‌రాబాద్ సీపీ కార్యాల‌యానికి వెళ్ల‌నున్నారు. త‌మ‌కు ప్రాణ‌హానీ ఉంద‌ని అవంతి ఫిర్యాదుచేయ‌నుంది. రాష్ట్రంలో ఈ నెల 25న చోటు చేసుకున్న హేమంత్‌ హత్య రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. (హేమంత్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement