
(ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా జాగ్రత్త చర్యలు తీసుకోని సూపర్ మార్కెట్‌లను జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చందానగర్‌కు చెందిన విజేత సూపర్ మార్కెట్‌ను శనివారం అధికారులు సీజ్ చేశారు. సూపర్ మార్కెట్‌లో భౌతిక దూరం పాటించకుండా ఒకేసారి ఎక్కుమందిని లోపలికి పంపడం, ఒకే దగ్గర అధిక సంఖ్యలో కస్టమర్స్ ఉండటంతో సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వాల్‌మార్ట్ ‘బెస్ట్ ప్రైస్’ సూపర్ మార్కెట్‌లో అధికారులు తనిఖీలు చేశారు. సీజ్ చేసినట్టు వచ్చిన వార్తలను వాల్‌మార్ట్ ఇండియా తోసిపుచ్చింది. అధికారులు తనిఖీలు మాత్రమే చేశారని వెల్లడించింది. లాక్‌డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నామని స్పష్టం చేసింది.
అయితే అధికారుల తీరుపై సూపర్ మార్కెట్ యాజమాన్యాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు అనువుగా నిత్యవసర సరుకులను అందిస్తున్న తమపై ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదని, దీనిపై ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్ గడువును తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment