super markets
-
అభివృద్ధీ... నీ పయనం ఎటు?
ఏడు సంవత్సరాల క్రితం 87 ఏళ్ల వయసులో మరణించిన భవిష్యత్తు వాది ఆల్విన్ టాఫ్లర్ ‘ఫ్యూచర్ షాక్’ అనే పుస్తకాన్ని 1970లో రాశాడు. వేగవంతమైన మార్పు ప్రజలను పిచ్చిగా మార్చుతుందని అందులో ఊహించారు. ఆ ఊహ నిజమే నని నా అనుభవాలే చెబుతున్నాయి. 75 ఏళ్ల వయసులో, ముందూ వెనుకా ఐదు తరాల వాళ్లను చూసిన మాలాంటి వారికి అభివృద్ధి పేరుతో వివిధ రంగాలలో చోటుచేసుకుంటున్న కొన్ని మార్పులు గమనిస్తుంటే ఆశ్చర్యం సంగతి అటుంచి, ఏంచేయాలో పాలుపోని పరిస్థితి కలుగుతున్నది. అన్నపూర్ణ లాంటి తెలుగు రాష్ట్రాలలో ఏ పట్టణంలో, ఏ హోటల్లో పోయినా కడుపునిండా తినే తెలుగువారి భోజనం దొరకదు. అన్నం, కూర, పప్పు, నెయ్యి, సాంబారు, రసం, గోధుమ పిండి రొట్టె, పూరీ లాంటి పదార్థాలతో భోజనం పెట్టే హోటళ్లు మచ్చుకైనా కానరావు. పేరుకు అన్నీ ఫైవ్ స్టార్, త్రీ స్టార్ హోటళ్లు. బిరియానీ, పలావ్, జింజర్ రైస్, పన్నీర్, మైదా పిండో మరేదో దానితో చేసిన బటర్ నాన్, నాన్, రోటీ, కుల్చా లాంటివి తినాల్సిందే. లేదా పస్తు ఉండాల్సిందే. ‘పేదరాసి పెద్దమ్మ’ సంస్కృతి రోజుల రుచికరమైన భోజనం, సత్రాల భోజనం, తరువాత కాలంనాటి ఉడిపి హోటళ్ళ భోజనాలు ఏమయ్యాయి? డాక్టర్ దగ్గరికి పోతే పాతరోజుల్లాగా ఒంటి మీద చేయి వేసి, స్టెతస్కోప్ పెట్టి పరీక్ష చేసి, చూడడం గత చరిత్ర అయిపోయింది. గుడికి పోతే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టనివ్వరు. తీర్థం ఒకచోట, ప్రసాదం ఇంకొక చోట ఇస్తారు. వివిధ రకాల సేవల పేరు మీద ఛార్జీలు ఉంటాయి. మొదట్లో పెద్ద గుళ్లకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు గ్రామాలకు, చిన్నచిన్న దేవాలయాలకు కూడా పాకింది. అన్నింటికీ అనవసరమైన పరిమితులు. ఇంటికి కావాల్సిన నెలవారీ సరుకులు ఒకప్పుడు హాయిగా దగ్గరలోని కొట్టుకుపోయి, స్వచ్ఛమైన, కల్తీలేని వాటిని, కొట్టువాడి ముందర పరీక్ష చేసి చూసుకుని, తూకం వేయించుకుని కొనుక్కునే వాళ్లం. ఇప్పుడు సంస్కృతి మారింది. పెద్దపెద్ద సూపర్ బజార్లలోకి పోయి, మనమే మనకు కావాల్సిన సామాన్లు వెతికి పట్టుకుని, ఒక బండిలో వేసుకుని తెచ్చుకోవాలి. అన్నీ ప్యాక్ చేసి ఉంటాయి. ఇన్ని గ్రాములు, ఇన్ని కేజీలు అని ఉంటుంది వాటిమీద. నిజంగా అంత తూకం ఉంటాయా లేదా అనేది సందేహమే! పైగా ఒక ఎక్స్పైరీ డేట్ వేస్తారు. అందులో ఎంత కల్తీనో తెలుసుకునే మానిటరింగ్ మెకానిజం లేదనాలి. సరుకు తెచ్చుకున్న తరువాత ప్యాకెట్లు విప్పిచూస్తే కొన్నిట్లో పురుగులు ఉంటాయి. ఇదేంది అని అడిగితే పాకింగ్ చేసింది మేం కాదుకదా! అని జవాబు. ఇక మెడికల్ షాప్‌కు పోతే మనకు కావాల్సింది ఒక ఐదారు టాబ్లెట్స్ అయినా... షాపువాడు మొత్తం స్ట్రిప్ కొనమంటాడు. ఏ వస్తువు కొన్నా (ఫర్నిచర్ దగ్గర నుండి, ఎలక్ట్రానిక్ పనిముట్ల వరకు) వాటికి రిపేర్ వస్తే, కొన్న చోట కాకుండా వేరే వర్క్ షాప్‌కు వెళ్లాలి. వాళ్లకు ఫోన్ చెయ్యాలంటే, టోల్ ఫ్రీ అనే నెంబర్‌కు చేయాలి. అది ఏ దేశంలో ఉంటుందో తెలియదు. వాళ్లు ‘ఒకటి నొక్కు, రెండు నొక్కు...’అంటూ డిస్కనెక్ట్ చేస్తారు. అసలు చిన్న చిన్న దుకాణాల సంస్కృతి పూర్తిగా పోవడం చాలా దురదృష్టకరం. చిన్నతనంలో తెల్ల కాగితాలు, పెన్సిల్, సిరా బుడ్డి, పిప్పరమింట్లు, చాక్లెట్లు, నువ్వుల జీడీలు, బిస్కట్లు లాంటివి కొనుక్కోవడానికి అక్కడక్కడ చాలా చిన్నచిన్న దుకాణాలు ఉండేవి. ఇప్పుడు చిన్న గుండు సూది కొనాలన్నా పెద్ద షాపునకు పోవాల్సిందే! అధిక ధరలు చెల్లించాల్సిందే. ఇంటి ముందుకు, తాజా కూరగాయలు తెచ్చి అమ్మే రోజులు పోయి కూరగాయల మార్కెట్లు వెలిశాయి. వాటిమీద బతికేవారు ఉపాధి కోల్పోయారు. ఫ్యామిలీ డాక్టర్ సంస్కృతీ పోయింది, పరాయి ఊరుకు వెళ్లినప్పుడు బంధువుల ఇళ్లలో ఉండే అలవాటు పోయింది. చక్కటి, చిక్కటి స్వచ్ఛమైన పాలను ఇంటి ముందర కొనుక్కునే ఆచారం పోయింది. ఇంటి వెనుక పెరుగు చిలికిన చల్ల కడుపు నిండా తాగే రోజులు పూర్తిగా పోయాయి. వేరు శనగపప్పుతో ఎవరికివారు శనగ నూనె చేయించుకుని ఏడాది పొడుగూతా వాడే అలవాటు పోయింది. నడక ప్రయాణం కనుమరుగైంది. కడుపు నిండా భోజనం తినే సంస్కృతి స్థానంలో పిజ్జా, బర్గర్స్ వచ్చాయి. స్వచ్చమైన వెన్న, నెయ్యి లభ్యమయ్యే ప్రదేశాలు మచ్చుకైనా లేవు. జొన్న చేలలో ఉప్పు, కారం కలుపుకున్న దోసకాయలు తినే రోజులు ఇకరావేమో! చేలల్లో పెసరకాయలు వలుచుకు తినే అదృష్టం ఇక లేనట్టేనేమో. అన్నీ ఫాస్ట్ ఫుడ్సే. పెరుగు, నెయ్యి, పాలు, తేనె, కూరలు, నూనె, ఒకటేమిటి... అన్నీ ప్యాక్ చేసిన (కల్తీ) ఆహారాలే! చివరకు సీజనల్ పండ్లు కూడా కలుషితమైనవే! కాలుతీసి కాలు బయట పెట్టకుండా, కనీస వ్యాయామం లేకుండా, ఒంటికి చెమట పట్టకుండా, నిరంతరం ఏసీ గదుల్లో ఉంటూ అన్నీ ఇంటి ముంగిటే పొందడం! బాత్రూమ్ కూడా బెడ్రూమ్కు అను బంధమే! ఇలా రాసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇలా ఎన్నో కోల్పోతున్నాం. ఇంకా ఎన్ని కోల్పోవాలో? ఇదంతా చూస్తూ, అను భవిస్తూ ‘అభివృద్ధీ నీ పయనం ఎటువైపు?’ అని నిట్టూర్చడం కన్న చేయగలిగిందేముంది? వనం జ్వాలా నరసింహారావు వ్యాసకర్త తెలంగాణ సీఎం సీపీఆర్ఓ -
ప్రజలను దోచుకుంటున్న వ్యాపారస్తులు.. ఇలా మోసం చేస్తున్నారు!
నగరంలోని ఓ కిరాణా దుకాణంలోని ఎలక్ట్రానిక్ కాంటాపై అర కిలో బరువు తూకం రాయి (బాట్) వేసి బరువు చూడగా 640 గ్రాములు డిస్ప్లే అయింది. కిలో బాట్ వేస్తే 1,180 గ్రాములు డిస్ప్లే అయింది. రెండు కిలోలకు 2,205 గ్రాములు డిస్ప్లే అయింది. చేపలు, మాంసం మార్కెట్లలో సైతం ఇదే పరిస్థితి కనిపించింది. ఓ షాపులో కిలో కంది పప్పు కొనుగోలు చేసి మరో షాపులోని డిజిటల్ త్రాసుపై తూకం వేస్తే 1100 గ్రాముల బరువు డిస్ప్లే అయింది. తిరిగి ఆప్షన్ సరి చేసి తూకం వేస్తే అసలు బరువు రూ.900 గ్రాములు డిస్ప్లే అయింది. దీనిని బట్టి చూస్తే ప్రతి షాపులో తూకంలో దోపిడే. ఒక షాపులో 100 గ్రాములు, మరో షాపులో 200 గ్రాములుంది. తూనికల కొలతల శాఖచే స్టాంపింగ్ చేసిన తూకం రాళ్లతో నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు. మార్కెట్లలో ‘సాక్షి’ పరిశీలనలో తూకం దోపిడీ బయటపడింది. సాక్షి, హైదరాబాద్: తప్పుడు తూకంతో వినియోగదారులు నిత్యం మోసపోతూనే ఉన్నారు. నిలువు దోపిడీకి గురై జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వీధిలోని చిన్న కిరాణా దుకాణానికో, సూపర్ మార్కెట్‌కో వెళ్లి ఏది కొన్నా.. తక్కువ తూకమే వస్తోంది. ఎలక్ట్రానిక్, డిజిటల్ త్రాసుపై తూకం వేసి ఇవ్వడంతో అంతా సవ్యంగానే ఉందనుకుంటాం. కానీ ఉండేది కిలో కాదు.. 900 నుంచి 950 గ్రాములే! లీటర్ నూనె గానీ, పాలు గానీ తీసుకుంటే వస్తున్నవి 850 నుంచి 950 మిల్లీలీటర్లే. ఇవే కాదు బియ్యం, ఉప్పులు, పప్పుల నుంచి బంగారం దాకా తూకంలో మోసం జరుగుతూనే ఉంది. ఇక నేరుగా లారీ లు, ట్రక్కులతోనే బరువు తూచే ఇసుక, ఇనుము వంటి వాటి తూకంలోనైతే భారీగా మోసాలు జరుగుతుంటాయి. వ్యాపారులు సాధారణ త్రాసులతో పాటు ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ట్యాంపర్ చేసి వినియోగదారులను నిలువు దోపిడీ చేయడం షరామామూలుగా మారింది. ఎలక్ట్రానిక్ కాంటాపై 1000, 2000 గ్రాముల తూకం రాళ్ల బరువు ఇలా.. 1,180, 2,205 ఎలక్ట్రానిక్లోనూ ట్యాంపరింగ్.. సాధారణ తూకం రాళ్ల త్రాసులతో మోసం జరుగుతుందని అందరూ భావిస్తారు.. అనుమానం వ్యక్తం చేస్తారు. అవసరమైతే వ్యాపారులను నిలదీస్తారు.. ఎలక్ట్రానిక్, డిజిటల్ త్రాసు, కాంటాల రీడింగ్ డిస్ప్లే అవుతుంది... అంతా కళ్ల ముందే కనిపిస్తుందని కాబట్టి మోసం జరగదన్న నమ్మకం ఉంటుంది. కానీ ఇక్కడే పప్పులో కాలేసేది. అసలు సాధారణ త్రాసుల కన్నా ఎలక్ట్రానిక్, డిజిటల్ త్రాసులతో మరింత సులువుగా మోసం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ కాంటాల్లో బరువు తూచే విధానాన్ని సవరించేందుకు మోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లను మార్చడం ద్వారా తక్కువ సరుకులు పెట్టినా డిస్ప్లేపై ఎక్కువ బరువు కనిపించేలా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. చేతివాటం ఇలా.. వ్యాపారులు ఎలక్ట్రానిక్, డిజిటల్ లో ఉన్న నాలుగు ఆప్షన్లలో ఒకదానిలో కిలోకు 100 నుంచి 150 గ్రాములు తక్కువగా సెట్టింగ్ చేస్తారు. ఉదాహరణకు.. ఆప్షన్ నొక్కి ఎలక్ట్రానిక్ మిషన్‌పై 850 నుంచి 900 గ్రామలు బరువు పెడితే 1000 గ్రాములు (కిలో) తూకం డిస్ప్లే అవుతోంది. అదే మీషన్‌పై వాస్తవంగా కిలో బరువు పెడితే 1100 నుంచి1150 గ్రాములు డిస్ప్లే అవుతుంది. అంటే ప్రతి కిలోకు వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు చేతివాటమే. అయిదు కిలోలు తీసుకుంటే 500 నుంచి 750 గ్రాముల వరకు కత్తెరే . మరో ఆప్షన్‌ను నొక్కి వేస్తే మాత్రం తూకం సక్రమంగా ఉంటుంది. బ్రాండ్ల ప్యాకింగ్‌లో సైతం మార్కెట్లో వివిధ బ్రాండ్ల నూనె ప్యాకెట్లలో నిర్దేశించిన బరువు కంటే తక్కువగా నూనె ఉంటోంది. లీటర్ ప్యాకెట్లలో 50 నుంచి 100 మిల్లీలీటర్లు, 5 లీటర్ల బాటిళ్లలో 200 నుంచి 400 మిల్లి లీటర్ల వరకు తక్కు వగా ఉండటం సర్వసాధారణం. పెట్రోల్ బంకుల్లో ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్ 50 మిల్లీలీటర్ల నుంచి 100 మిల్లీలీటర్ల వరకు తక్కువగా ఉంటోంది. కూరగాయలు, పండ్లు, మాంసం, చేపల మార్కెట్ల వంటి చోట్ల అడుగున కట్ చేసిన తప్పుడు తూకం రాళ్లను వినియోగిస్తుంటారు. కొందరు వినియోగదారులు గుర్తించి ఫిర్యాదులు చేసినా... చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నగరంలోని సికింద్రాబాద్, రాంనగర్, గడ్డిఅన్నారం, మాదన్నపేట, గుడిమల్కాపూర్, కొత్తపేట తదితర మార్కెట్లలో తనిఖీ చేసేందుకు సిబ్బంది కొరత ఉంది. సమస్య వేధిస్తోంది.. నగర పరిధిలో çసుమారు 3 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వ్యాపార సముదాయాలపై దాడులు, తనిఖీలు చేసి అక్రమాలను నియంత్రించే తూనికలు, కొలతల శాఖ సిబ్బంది సంఖ్య వేళ్లపై లెక్కించవచ్చు. గ్రేటర్ పరిధిలో అధికారులు, సిబ్బంది 25 మందికి మించరు. వారు కూడా తూతూమంత్రపు తనిఖీలు, నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. కళ్లెదుటే మోసగిస్తారు.. మాదన్నపేట మార్కెట్లో కళ్లెదుటే తూకంలో దండి కొడతారు. అడిగితే గొడవకు దిగుతారు. కిలో కూరగాయలు కొంటే 800 గ్రాములే వస్తున్నాయి. – దశరథ లక్ష్మి, మాదన్నపేట ఫిర్యాదు నంబర్లను ప్రదర్శించాలి తూకంలో తేడా వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్‌నంబర్లను మార్కెట్లలో ప్రదర్శించాలి. – లలిత, కుర్మగూడ ఫిర్యాదు చేయొచ్చు ఇలా.. టోల్ ఫ్రీ నంబర్ : 180042500333 వాట్సాప్ నంబర్ : 73307 74444 ఈ మెయిల్ ఐడీ: clm&ts@nic.in -
సూపర్మార్కెట్ల ‘చేయూత’
సాక్షి, అమరావతి: మార్కెట్ ధరలకన్నా తక్కువకే నాణ్యమైన నిత్యావసర వస్తువులను గ్రామీణులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యాచరణను సిద్ధంచేసింది. ఇందులో భాగంగా పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో మండలాల వారీగా ‘చేయూత’ మహిళా సూపర్మార్కెట్లను ఏర్పాటుచేయనుంది. పొదుపు సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన జగనన్న మహిళా మార్ట్లు విజయవంతం కావడంతో ఈ ఫార్ములాను గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలుచేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సంకల్పించింది. ప్రయోగాత్మకంగా జూలై నాటికల్లా జిల్లాకు రెండేసి చొప్పున 52 మండలాల్లో వీటిని ఏర్పాటుచేయనుంది. చేయూత మహిళా మార్ట్‌గా వీటికి నామకరణం చేశారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున ఈ మహిళా మార్ట్లను ఏర్పాటుచేస్తారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా అర్హులైన పేద మహిళలకు ఏటా దాదాపు రూ.11 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఆర్థిక లబ్ధిపొందిన మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, హిందూస్థాన్ లీవర్, ఐటీసీ, రిలయెన్స్, అమూల్ వంటి అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థలు సాధారణ మార్కెట్ ధర కన్నా తక్కువకే తమ కిరాణా సరుకులను 78,931 మహిళా సంఘాల రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తున్నాయి. తక్కువ ధరకే సేకరణ.. విక్రయాలు ఇక సూపర్ మార్కెట్‌కు అవసరమైన ఇడ్లీ రవ్వ, గోధుమ పిండి, కారం, పసుపు, వివిధ రకాల మసాలాలతో పాటు నెయ్యి, పల్లీచిక్కీ వంటి స్థానికంగా దొరికే నాణ్యమైన ఉత్పత్తులను పొదుపు సంఘాల్లోని మహిళలు సేకరిస్తారు. మరోవైపు.. ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న కార్పొరేట్ సంస్థలు కూడా తమ ఉత్పత్తులను హోల్‌సేల్ వ్యాపారులకు ఇచ్చే ధరకే మహిళా సంఘాలకు సరఫరా చేసే అవకాశం ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతంలో సాధారణ వ్యాపారుల కన్నా తక్కువ ధరకు ఈ సూపర్ మార్కెట్లు నాణ్యమైన నిత్యావసర సరుకులు సేకరించే వీలుందని.. అదే సమయంలో కొంత లాభం వేసుకుని మార్కెట్ ధర కన్నా తక్కువకు వినియోగదారులకు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మహిళా మార్ట్ల ఏర్పాటు ఇలా.. మండలంలోని మహిళా సంఘాల సభ్యులందరూ ఫెడరేషన్‌గా ఏర్పడతారు. అందులో ప్రాథమికంగా ఒకొక్కరు రూ.150ల నుంచి రూ.200ల మధ్య షేర్ క్యాపిటల్‌గా పెట్టుబడి పెడతారు. అదనంగా అవసరమైన నిధులను మండల సమాఖ్య ద్వారా స్త్రీనిధి, లేదంటే బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని కనీసం రూ.30 లక్షలతో ఈ సూపర్ మార్కెట్లను ఏర్పాటుచేస్తారు. ఆ మండలంలోని పొదుపు సంఘాల మహిళలు ప్రతినెలా తమ కుటుంబ అవసరానికి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ ఆ సూపర్‌మార్కెట్ ద్వారానే కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తారు. ఇతర వినియోగదారులను కూడా ఆకర్షించేలా హోల్‌సేల్ ధరలకే సరుకులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మరోవైపు.. మండల పరిధిలో ఎక్కువమందికి అందుబాటులో ఉండేలా ఓ పెద్ద గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడ కనీసం 1000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటుచేస్తారు. వీటి ద్వారా నెలకు కనీసం లక్షన్నర నుంచి రెండున్నర లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారుల ప్రాథమిక అంచనా. వచ్చే లాభాలను మొదట్లో ఫెడరేషన్ సభ్యుల్లో అవసరమైన వారికి తక్కువ వడ్డీకి రుణం ఇవ్వడం.. తర్వాత దశలో లాభాలను సమానంగా పంచుకోవడం వంటివి ఉంటాయి. సూపర్‌మార్కెట్ నిర్వహణకు కమిటీలు ఇక సూపర్ మార్కెట్ నిర్వహణకు పొదుపు సంఘాల్లోని మహిళలతో కమిటీలను ఏర్పాటుచేస్తారు. వాటిల్లో పనిచేసేందుకు సిబ్బందిని కూడా పొదుపు సంఘాల్లోని చురుకైన మహిళలనే ఎంపిక చేస్తారు. ఇక సూపర్ మార్కెట్ రోజు వారీ నిర్వహణ, కావాల్సిన సరుకులను ఎప్పటికప్పుడు కొనుగోలు చేయడం.. అమ్మకాలకు సంబంధించి రికార్డుల నిర్వహణపై సభ్యులకు సెర్ప్ అధికారులతో పాటు వివిధ అంతర్జాతీయ వ్యాపార సంస్థలతో శిక్షణ ఇప్పిస్తారు. 15, 16 తేదీల్లో జిల్లా పీడీల భేటీ పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జగనన్న మహిళా మార్ట్లు విజయవంతం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లోనూ చేయూత మహిళా మార్ట్ల పేరుతో ఏర్పాటుచేస్తున్నాం. ప్రాథమికంగా ప్రతి జిల్లాకు రెండేసిచోట్ల జూలై నాటికి వీటిని ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. దీనిపై చర్చించేందుకు ఈ నెల 15, 16 తేదీల్లో అన్ని జిల్లాల పీడీలతో సమావేశం ఏర్పాటుచేశాం. – మహ్మద్ ఇంతియాజ్, సెర్ప్ సీఈవో -
మార్కెట్లకు పోటెత్తిన జనం
-
రెండో రోజు లాక్డౌన్: మార్కెట్లకు పోటెత్తిన జనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండో రోజు లాక్డౌన్ కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని అన్ని ట్రాఫిక్ కూడళ్లలో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో 350 చెక్‌పోస్టులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. బారికేడ్లు పెట్టి పలు ఫ్లైఓవర్లను పోలీసులు మూసేస్తున్నారు. కొన్ని చోట్ల ఉదయం 10 గంటల తర్వాత కూడా జనాలు రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై జనాలను ఇళ్లకు వెళ్లవల్సిందిగా కోరుతున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పది గంటల వరకే సమయం ఉండటంతో నిత్యావసరాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలివచ్చారు. మరోవైపు.. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్‌ను వీడి సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా లాక్డౌన్ ఆంక్షల సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే అన్న విషయం తెలిసిందే. ► సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కుకు వేలసంఖ్యలో వలస కార్మికులు చేరుకుంటున్నారు. దీంతో.. రిజర్వేషన్ ఉన్నవారినే చెక్ చేసి రైల్వే అధికారులు వారిని స్టేషన్ లోపలికి అనుమతిస్తున్నారు. కాగా లాక్డౌన్ నేపథ్యంలో ఒరిస్సా, యూపీ, మహారాష్ట్రలకు కూలీలు తరలివెళ్తున్నారు. స్టేషన్ బయట కిలోమీటర్ల మేర బారులు తీరారు. ► కామారెడ్డి: జిల్లాలోని ఎల్లారెడ్డి కూరగాయల మార్కెట్లో ప్రజలు బారులు తీరారు. రంజాన్ సందర్భంగా నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మైనార్టీలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం 10 వరకే దుకాణాలు తెరిచి ఉండటంతో పలు మార్కెట్లు రద్దీగా మారాయి. ► కరీంనగర్: కరీంనగర్లో పలు చోట్ల మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. లాక్డౌన్ ఆంక్షల సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కేవలం నాలుగు గంటల పాటు ఉండడంతో నిత్యావసర వస్తువులు, కూరగాయల కోసం జనం అధిక సంఖ్యలో మార్కెట్లకు తరలి వస్తున్నారు. దీంతో పలు చోట్ల రోడ్లు ట్రాఫిక్ జామ్‌తో రద్దీగా మారాయి. ► యాదాద్రి భువనగిరి: భువనగిరిలో నిత్యవసర వస్తువులు, కూరగాయల కోసం ప్రజల పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలివస్తున్నారు. దీంతో కూరగాయల మార్కెట్లు కిక్కిరిసి పోయాయి. దీంతో రోడ్డపై ట్రాఫిక్ జామ్ అయింది. చదవండి: లాక్డౌన్: హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు పయనం -
Telangana: అమల్లోకి వచ్చిన లాక్డౌన్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్డౌన్ విధించింది. ఉదయం 10గంటల నుంచి లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి (మే 12 నుంచి 21 వరకు) పదిరోజుల పాటు లాక్డౌన్ కొనసాగుతుంది. రోజూ ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. అత్యవసర సర్వీస్‌లకు మినహాయింపు ఉంది. టీకా కోసం వెళ్లేవారికి మినహాయింపు ఇచ్చారు. ఇక లాక్డౌన్ ఆంక్షలను కేవలం నాలుగు గంటలు మాత్రమే సడలింపు ఇవ్వడంతో మార్కెట్లలో తీవ్రమైన రద్దీ నెలకొంది. జనం నిత్యావసరాల కోసం ఉదయం నుంచి క్యూ కట్టి బారులు తీరారు. లాక్డౌన్ విధించడంతో చాలా మంది సొంతూళ్లకు పయనం అయ్యారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాలు క్యూ కట్టాయి. దీంతో నగరంలోని పలు రోడ్డు ట్రాఫిక్ జామ్‌తో నిండిపోయాయి. అదేవిధంగా నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద ప్రయాణికుల రద్దీ నెలికొంది. మరోవైపు తెలంగాణలో యథావిధిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది. తెలంగాణలో రెండో డోసు వారికే వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. రెండో డోసు వ్యాక్సిన్ కోసం తెలంగాణలో పలు టీకా కేంద్రాల దగ్గర ప్రజలు భారీగా క్యూలైన్లో నిల్చుంటున్నారు. ఇక లాక్‌డైన్ ఆంక్షల సడలింపు కేవలం నాలుగు గంటలు మాత్రమే ఉండడంతో పలు సూపర్ మార్కెట్లు వ్దద ఎటు చూసినా జనమే ఉన్నారు. పలు సూపర్ మార్కెట్లు, దుకాణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఉదయం 6నుంచి 10గంటల వరకు మాత్రమే వ్యాపార సముదాయాలకు అనుమతి ఉన్న విషయం తెలిసిందే. దీంతో కూరగాయల మార్కెట్లకు ప్రజలు పోటెత్తుతున్నారు. కొన్ని మార్కెట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. అదే విధంగా గ్రేటర్, జిల్లా, ఆర్టీసీ బస్సులకు ఉదయం10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది. లాక్డౌన్ కారణంగా నగరవాసులు సొంతూళ్లకు పెద్ద సంఖ్యలో పయణమవుతున్నారు. ఇక ఇతర రాష్ట్రాల బస్సులకు అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. కొనసాగనుంది. తెలంగాణలో10 రోజులు రిజిస్ట్రేషన్లు బంద్ రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా పది రోజుల పాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే స్లాట్‌బుక్ చేసుకున్నవారికి రీ షెడ్యూల్ అవకాశం కల్పిస్తామని చెప్పారు. లాక్డౌన్ అనంతరం వీటిపై మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు. ప్రజలెవరూ తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లకు రావొద్దని సూచించారు. చదవండి: తెలంగాణ 10 రోజులు లాక్డౌన్.. మినహాయింపు వాటికే! -
ఇక మీదట ఇంట్లో కూడా మాస్క్
సిడ్ని: కరోనా విజృంభిస్తోన్న వేళ మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడమే శ్రీరామ రక్ష అంటూ ప్రభుత్వాలు ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. సాధారణంగా అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించి.. తిరిగి రాగానే తీసేస్తాం. కానీ బీఎమ్‌జే గ్లోబల్ హెల్త్‌లో ప్రచురితమైన ఓ నివేదిక మాత్రం ఇక మీదట ఇంట్లో కూడా మాస్క్ ధరించాలని చెబుతుంది. అప్పుడే మనతో పాటు మన కుటుంబ సభ్యులను కూడా మహమ్మారి బారి నుంచి కాపాడుకోగలమంటుంది ఈ నివేదిక. ఇంట్లో ఎవరికి కరోనా సోకక ముందు నుంచే మాస్క్ ధరిస్తే.. వైరస్ వ్యాప్తిని 79 శాతం.. ప్రతి రోజు ఇంటిని బ్లీచ్, ఇతర క్రిమిసంహారకాలతో శుభ్రపరిస్తే.. 77 శాతం వైరస్ వ్యాప్తిని నిరోధించగమలని సదరు నివేదిక వెల్లడించింది. కుటుంబ సభ్యుల మధ్య కనీసం ఒక మీటరు సామాజిక దూరం తప్పనిసరి అని ఈ నివేదిక తెలిపింది. కుంటుంబాల్లోనే వ్యాప్తి ఎక్కువ ఈ నివేదిక తెలిపిన దాని ప్రకారం చైనాలో ఫిబ్రవరిలో నమోదయిన క్లస్టర్ కేసులు సూపర్ మార్కెట్, పాఠశాలల నుంచి వచ్చినవి కావని.. కుటుంబాలలోనే వ్యాప్తి చెందిన కేసులని తెలిపింది. దాదాపు 1000 క్లస్టర్ కేసులను పరిశీలించినప్పుడు వాటిలో 83 శాతం కేసులు కుంటుబ సమూహాలుగా గుర్తించబడ్డాయని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వైరస్ నిపుణుడు వు జున్యూ తెలిపారు. బయటకు వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించడం.. మాస్క్ ధరించం వల్ల వైరస్ వ్యాప్తిని నిరోధించగలమన్నారు వూ జున్యూ. అయితే ఇంటిలో కూడా మాస్క్ ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించేందుకు చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే ఇంట్లో కూడా మాస్క్ ధరించడం మంచిదే అన్నారు వు జున్యూ. (‘మాస్క్ లేదా.. పొర్లుదండాలే’) చైనాలో జరిగిన మరో సర్వే కోసం బీజింగ్‌లోని 124 కుటుంబాలకు చెందిన 460 మందిని పరిశోధకులు పిలిపించారు. వీరంతా వైరస్ సోకిన వ్యక్తుల కుటుంబ సభ్యులు. తమ కుటుంబ సభ్యులకు మహమ్మారి సోకిన సమయంలో ఇంటి శుభ్రత, ఇతర అంశాల ఎలా ఉండేవని పరిశోధకులు వీరిని ప్రశ్నించారు. ఈ 124 కుంటుంబాలలో.. 41 ఇళ్లలో మొదట వైరస్ సోకిన వారి నుంచి దాదాపు 77 మందికి వ్యాధి సోకినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే మిగతా కుటుంబాలలో తొలుత ఒకరికి కరోనా వచ్చినప్పటికి.. ప్రతి రోజు ఇంటిని బ్లీచ్, ఇతర క్రిమిసంహారకాలతోతో శుభ్రపర్చడం.. కిటికీలు తెరిచి ఉంచడం.. ఇంట్లోని వ్యక్తుల మధ్య కనీసం 1 మీటర్ (3 అడుగులు) సామాజిక దూరం పాటించడం వంటి చర్యలు తీసుకోవడం వల్ల మిగత వారికి వైరస్ సోకలేదని పరిశోధకులు గుర్తించారు. అంతేకాక ఇంట్లో కుటుంబ సభ్యులందరు ఒక్కచోట చేరి భోజనం చేయడం, టీవీ చూడటం వల్ల వైరస్ సోకే ప్రమాదం 18 శాతం ఎక్కువ ఉన్నట్లు ఈ సర్వే తెలిపింది. (ఎందుకు రిస్క్? వేస్కోండి మాస్క్) ఇంట్లో మాస్క్.. మంచిదే అంటున్న నిపుణులు ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. అధ్యయనంలో పాల్గొనని నిపుణులు కూడా ఈ నివేదిక ప్రాముఖ్యతను గుర్తించారు. ‘ఇంట్లోనూ మాస్క్ ధరించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే లాక్డౌన్ సడలించిన తర్వాత బయట నుంచి ఇంటికి (ఉదా. ప్రజా రవాణా, ఆఫీసు నుంచి) వచ్చిన వ్యక్తి ద్వారా ఇతర కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ప్రమాదం ఉంది. అయితే దీని గురించి వెంటనే మనకు తెలియదు కాబట్టి మిగితా కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకే ప్రమాదం అధికం. కనుక ఇంట్లో కూడా మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం వల్ల మనతో పాటు మన కుటుంబ సభ్యులను కూడా కాపాడుకున్నవారం అవుతాం’ అని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ సాలీ బ్లూమ్‌ఫీల్డ్ ఒక ప్రకటనలో తెలిపారు.(అలాంటిదేం లేదు.. అయినా పాజిటివ్!) ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ట్రిష్ గ్రీన్హాల్గ్ ఈ నివేదికపై స్పందిస్తూ.. ‘ఇప్పటికే చాలా మంది వైరస్ సోకనప్పటికి కూడా ముందు జాగ్రత్త చర్యగా ఇంట్లో మాస్క్ ధరించడం చేస్తున్నారు. కోవిడ్ -19 సోకడానికి ముందే మాస్క్ ధరించడం ద్వారా ఇంటిలోని ఇతరులకు వైరస్ వ్యాపించే అవకాశం చాలా తక్కువగా ఉంది. వ్యాధి సోకిన తర్వాత ముసుగు ధరించడం ప్రారంభించిన వారు తమ కుటుంబాన్ని రక్షించలేకపోయారు’ అని గ్రీన్హాల్గ్ వెల్లడించారు. లండన్ యూనివర్శిటీ కాలేజీ డాక్టర్ ఆంటోనియో లాజారినో మాట్లాడుతూ.. ‘ఈ నివేదిక మంచిదే కానీ అధికారిక సిఫార్సులు చేయడానికి ఈ అధ్యయనం సరిపోదు. ఎందుకంటే ఇది శాస్త్రీయమైనది కాదు. గణాంక విశ్లేషణలో అనేక పరిమితులను కలిగి ఉంది. ప్రధాన లిమిటేషన్ ఏమిటంటే ఇది వ్యక్తిగత స్థాయిలో కాకుండా కుటుంబ స్థాయిలో రూపొందించబడింది’ అన్నారు. -
కాలక్షేపం కోసం వీటిని తినేస్తున్నారు..
సాక్షి, సిటీబ్యూరో : చిన్న పిల్లలు నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఇష్టపడేది స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్ ఐటెమ్స్. లాక్డౌన్ కారణంగా ఇప్పుడు వాటికి కష్టకాలం వచ్చింది. సూపర్ మార్కెట్, కిరాణా దుకాణాల్లోనూ స్టాక్ లేక వినియోగదారులు నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు బిస్కెట్లు, చాక్లెట్లు, వేపర్స్, చిప్స్, కార్న్‌ఫ్లేక్, కుర్కురే, పల్లీ చిక్కీలు, ఐస్‌క్రీమ్, నూడిల్స్, పాస్తా, చుడువా, సూప్స్, నమ్కిన్, గులాబి జామున్ తదితర స్నాక్, ఇన్స్టంట్ ఫుడ్ ఐటమ్స్ నిల్వలు నిండుకున్నాయి. ఒక వైపు కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వినియోగదారులు ఇళ్లలో ఉండి కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం కోసం వీటిని ఎక్కువగా తింటున్నారు. దీంతో స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్స్‌కు ఒకేసారి డిమాండ్ పెరిగింది. మరోవైపు లాక్‌డౌన్‌తో వాటి ఉత్పత్తి ఆగి సరఫరా లేకుండా పోయింది. ఈ కారణంగానే మార్కెట్లో ఇప్పుడు స్నాక్స్ కొరత ఏర్పడింది. తాజాగా ఇండస్ట్రీ సెక్టార్‌కు గ్రీన్ సిగ్నల్ లభించినా..కార్మికుల కొరతతో డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి కావడం లేదు. దీంతో వాటి సరఫరా తగ్గుముఖం పట్టింది. స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్ ఐటెమ్స్‌కు ఇండెంట్ ఆర్డర్స్ పెడితే...పెట్టిన దాంట్లో కనీసం 30 శాతం కూడా సరఫరా కాని పరిస్థితి నెలకొందని వ్యాపారులు, సూపర్ మార్కెట్ల మేనేజర్లు పేర్కొంటున్నారు. (మహమ్మారి.. దారి మారి! ) లోకల్ ఉత్పత్తులు పెద్ద పెద్ద సంస్థలకు చెందిన స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్ ఉత్పత్తుల సరఫరా నిలిచిపోవడంతో కొంతమేర లోకల్ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇక కొన్ని సూపర్ మార్కెట్స్ తమ సంస్థల పేర్లతో స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి అమ్మడం ప్రారంభించాయి. పేరొందిన సూపర్ మార్కెట్లు, స్థానిక చిన్న చిన్న సంస్ధలు సైతం సొంతంగా బిస్కెట్లు, చిప్స్, ఐస్‌క్రీమ్, నమ్కిన్, నూడుల్స్, సూప్స్ తదితర ఐటెమ్స్‌ను సొంతంగా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వినియోగదారులు మాత్రం బ్రాండ్ ఉత్పత్తులపైనే ఆసక్తి కనబర్చుతున్నట్లు తెలుస్తోంది. కిరాణా దుకాణాల్లో మాత్రం పేద, మధ్య తరగతి వర్గాల నుంచి మాత్రం లోకల్ ఉత్పత్తులకు ఆదరణ బాగానే లభిస్తోంది. (కరోనా: టాస్క్‌ఫోర్స్‌కు రిస్క్!) -
సూపర్ మార్కెట్లలో అడ్డగోలు రేట్లు..
సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసరాల ధరలు సామాన్యుణ్ణి బెంబేలెత్తిస్తున్నాయి. సూపర్ మార్కెట్లు వినియోగదారులను దోచేస్తున్నాయి. జనవరి నెలతో పోల్చితే ఏప్రిల్ చివరి వారం నాటికి ప్రజలు నిత్యం ఉపయోగించే పప్పులు, వంట దినుసుల ధరలు బాగా పెరిగాయి. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా విక్రయించడం విస్మయానికి గురిచేస్తోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రతి వస్తువును సాధారణ ధర కంటే సుమారు 20 నుంచి 30 శాతానికి పైగా పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. హైదరాబాద్ మహా నగరంలో హోల్ సేల్ నుంచి రిటైల్ కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో ధరలు అమాంతం పెరిగిపోయాయి. లాక్డౌన్ నేపథ్యంలో దినసరి కూలీలకు, కార్మికులకు ఎలాంటి ఆదాయమూ లేకపోవడంతో పూట గడవటం కష్టంగా మారింది. కొద్దో గొప్పో కొనుక్కోగలిగే స్థోమత ఉన్న మధ్య తరగతి ప్రజలు కూడా ధరాఘాతానికి వెనక్కి తగ్గక తప్పడం లేదు. బియ్యంతోపాటు వివిధ పప్పు దినుసులరేట్లకు అదుపు లేకుండా పోయింది. ఏకంగా ఉప్మా రవ్వ కిలో ధర రూ.45 నుంచి 55 పలుకుతుండగా కిలో చింతపండు ధర రూ.260లకు ఎగబాకింది. పెసర పప్పు కిలో ధర రూ.141కు పెరిగింది. హెచ్ఎంటీ రకం బియ్యం కిలో రూ.55 నుంచి 65 వరకు పలుకుతుండగా. మసూరి బియ్యం ధర కిలో 56 నుంచి 59, కర్నూలు రైస్ రూ 49 నుంచి 58 వరకు పలుకుతున్నాయి. కిరాణా షాపులకు బంద్ హైదరాబాద్‌లో ప్రధాన హోల్ సేల్ మార్కెట్లయిన బేగంబజార్, మలక్‌పేట్ మార్కెట్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ కిరాణా షాపులకు సరఫరాను నిలిపి వేశారు. దీంతో సూపర్ మార్కెట్లకు డిమాండ్ పెరిగింది. గిరాకీని క్యాష్ చేసుకునేందుకు ఇక్కడ రేట్లు పెంచేశారు. అయినా అడిగే నాథుడు లేడు. మహానగరంలో గుజరాతీ, మార్వాడీలకు సంబధించిన కిరాణా దుకాణాలు కొన్ని మూతపడటంతో సూపర్ మార్కెట్లకు మరింత కలిసి వచ్చినట్లయింది. ముఖ్యంగా హోల్‌సేల్ మార్కెట్ వ్యాపారులు సృష్టిస్తున్న కొరతతో ఒకవైపు ఎగబాకిన ధరలు, మరోవైపు కరోనా భయంతో కొందరు గుజరాతీ, మార్వాడీలు దుకాణాలు మూసివేసి ఫోన్ ఆర్డర్ల పైనే తమ ఖాతాదారులకు సరుకులు డెలివరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వినియోగదారులు సూపర్ మార్కెట్స్‌ను ఆశ్రయించక తప్పడం లేదు. రోజువారి నిత్యావసరాలైన గోధుమ పిండి, ఇడ్లీ..ఉప్మా రవ్వలు, టీ, కాఫీ పొడి, చక్కెర, పసుపు, నూనె, పప్పులు, సబ్బులు, హ్యాండ్‌వాష్ తదితర వాటికి డిమాండ్ బాగా పెరిగింది. ధరల నియంత్రణేది..? లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల ధరలపై నియంత్రణ లేకుండా పోయింది. పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి చర్యలు చేపట్టినా...ధరలు అదుపులోకి మాత్రం రావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌తోపాటు హైదరాబాద్ సీఆర్వో ఆఫీస్‌లో ప్రత్యేక ల్యాండ్‌లైన్ ఏర్పాటు చేసి అధిక ధరలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అయినా ఫలితం కన్పించడం లేదు. మరోవైపు తూనికలు..కొలతల శాఖ దాడులకు దిగి «కేసులు నమోదు చేస్తున్నా..ధరలు మాత్రం అదుపులోకి రావడం లేదు. అధిక ధరలపై ఫిర్యాదు చేయండి... హైదరాబాద్ జిల్లా చీఫ్ రేషనింగ్ ఆఫీస్: 040–23447770 తూనికల, కొలుతల శాఖ ఎమ్మార్పీ, తూకం మోసాలపై: 7330774444 టోల్ ఫ్రీ నెంబర్: 1800–42500333 -
విజేత సూపర్ మార్కెట్ సీజ్
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా జాగ్రత్త చర్యలు తీసుకోని సూపర్ మార్కెట్లను జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చందానగర్‌కు చెందిన విజేత సూపర్ మార్కెట్‌ను శనివారం అధికారులు సీజ్ చేశారు. సూపర్ మార్కెట్లో భౌతిక దూరం పాటించకుండా ఒకేసారి ఎక్కుమందిని లోపలికి పంపడం, ఒకే దగ్గర అధిక సంఖ్యలో కస్టమర్స్ ఉండటంతో సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వాల్‌మార్ట్ ‘బెస్ట్ ప్రైస్’ సూపర్ మార్కెట్లో అధికారులు తనిఖీలు చేశారు. సీజ్ చేసినట్టు వచ్చిన వార్తలను వాల్‌మార్ట్ ఇండియా తోసిపుచ్చింది. అధికారులు తనిఖీలు మాత్రమే చేశారని వెల్లడించింది. లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నామని స్పష్టం చేసింది. అయితే అధికారుల తీరుపై సూపర్ మార్కెట్ యాజమాన్యాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక లాక్డౌన్ సమయంలో ప్రజలకు అనువుగా నిత్యవసర సరుకులను అందిస్తున్న తమపై ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదని, దీనిపై ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్డౌన్ గడువును తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. కిరాణా వర్తకుడికి కరోనా పాజిటివ్ -
సరుకులు లేవు.. సరఫరా చాలదు
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచే కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లకు సరుకు రవాణా క్లిష్టతరంగా మారింది. డిమాండ్ మేరకు నిత్యావసరాలు సరఫరా లేకపోవడం, గోదాముల్లో సరుకుల రవాణాకు, ప్యాకేజింగ్‌కు సిబ్బంది కొరత ఉండటంతో నిల్వలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే నగరంలోని చాలా సూపర్మార్కెట్లలో ఖాళీ ర్యాంకులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా రోజువారీ అవసరాల్లో ప్రధానంగా వాడే ఉప్మా, ఇడ్లీ రవ్వలతో పాటు, టీ, కాఫీ పొడి, కారం, చక్కెర, పసుపు, నూనెలు, గోధుమపిండి వంటి సరుకులతో పాటు డిటర్జెంట్లు, హ్యాండ్‌వాష్‌లు, న్యాప్కిన్లు, డైపర్ల సరఫరా తగ్గడంతో వీటికి కొరత ఏర్పడుతోంది. డిమాండ్‌కు తగ్గట్లు లేని సరఫరా.. లాక్డౌన్ నేపథ్యంలో వినియోగదారులు పెద్ద ఎత్తున అవసరాలకు మించి కొనుగోళ్లు చేశారు. సాధారణంగా వారానికి సరిపడా సరుకులను కొనుగోలు చేసే అలవాటుకు భిన్నంగా కొందరు ముందుగానే పెద్దమొత్తంలో సరుకులను కొనుగోళ్లు చేశారు. దీంతో అవి నిండుకున్నాయని కిరాణా వర్తకులు తెలిపారు. ‘రాష్ట్రానికి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి చక్కెర, గుజరాత్ నుంచి ఉప్పు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి శనగపప్పు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కందిపప్పు, రాజస్తాన్ నుంచి పెసరపప్పు, కృష్ణపట్నం, కాకినాడ, చెన్నై ఓడరేవుల నుంచి ముడి వంట నూనెలు వస్తుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సరుకులు తెచ్చే వాహనాలకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్దే ఇబ్బందులు ఎదురౌతున్నాయి. దానికి తోడు ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉధృతి తీవ్రంగా ఉండటంతో లారీ డ్రైవర్లు, క్లీనర్లు రవాణాకు ముందుకు రావడం లేదు. కొన్ని సరుకు రవాణా వాహనాలు వస్తున్నా, అవి అనేక చోట్ల చెక్‌పోస్టులు దాటాల్సి రావడంతో ఒక్క రోజులో వచ్చే వాటికి రెండున్నర రోజుల గడువుపడుతోంది’అని బేగంబజార్‌కు చెందిన వర్తకులు తెలిపారు. అదీగాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కిరణా దుకాణాలు, సూపర్ మార్కెట్లకు సరుకులు సరఫరా చేసే బేగంబజార్ మార్కెట్లో రద్దీని నివారించేందుకు విడతల వారీగా దుకాణాలు తెరుస్తున్నారు. పప్పులు సరఫరా చేసే దుకాణం ఒక రోజు తెరిస్తే, మళ్లీ అది తెరిచే వంతు నాలుగు రోజులకు గానీ రావట్లేదు. దీంతోనూ తగినంత సరుకుల సరఫరా అనుకున్నంత జరగడం లేదని తెలుస్తోంది. ఇక సూపర్మార్కెట్ల గోదాముల్లో కొంత నిల్వలు ఉంటున్నా, వాటిని ప్యాకేజింగ్ చేసేందుకు సిబ్బంది రావడం లేదని మరికొందరు వ్యాపారులు చెబుతున్నారు.ప్యాకేజీ పనులకు గతంలో 30, 35 మంది కార్మికులతో చేపట్టే చోట ప్రస్తుతం ఐదుగురికి మించి లేకపోవడంతో స్టాక్‌ను మార్కెట్లకు తీసుకురావడం సైతం ఇబ్బందిగా మారిందని బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ సూపర్ మార్కెట్ మేనేజర్ ఒకరు వెల్లడించారు. దీంతో తమ మార్కెట్‌కు వచ్చే వారు సగం సరుకులే కొనుగోలు చేసి వెళుతున్నారని వెల్లడించారు. -
మార్చి31 వరకు బంద్: స్టోర్లలో ఎగబడిన జనం
సాక్షి, హైదరాబాద్ : కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రత్తమయ్యాయి. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ముందుస్తు జాగ్రత్తలు చేపట్టింది. మార్చి 31 వరకు విద్యాసంస్థలు, థియేటర్లతో పాటు జనసామర్థ్యం ఎక్కువగా ఉండే రధ్దీ ప్రాంతాలపై నిషేదాజ్ఞలు విధించింది. అయితే సరుకుల కొరతతో ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సూపర్ మార్కెట్లు, దుకాణాలు యథావిథిగా కొనసాగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే మార్చి 31 వరకు తెలంగాణలో అన్ని సూపర్ మార్కెట్లు, దుకాణాలు మూసివేస్తున్నారని పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అందోళనకు గురైన ప్రజలు సరుకుల కోసం సూపర్మార్కెట్లు, దుకాణాల్లో లైన్లు కట్టారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అన్ని షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు జనాలతో కిటకిటలాడాయి. అయితే నిత్యావసర వస్తువుల విషయంలో ఎలాంటి ఢోకా లేదని, ప్రజలు దిగులు చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా వదంతులను నమ్మవద్దని, ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని పేర్కొంది. అదేవిధంగా కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. దగ్గు, జలుబు, తుమ్ములు, జర్వం, శ్వాస తీసుకోవడలో ఇబ్బందులు పడుతున్నా వారితో పాటు ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. ఈ రుగ్మతలున్నవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతిరూములును, మాస్కులు ధరించాలన్నారు. దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఇతరులకు మీటరు దూరంలో ఉండాలన్నారు. ప్రతి అరగంటకు ఒకసారి చేతులను సబ్బు లేదా సానిటైజర్తో శుభ్రపర్చుకోవాలని సూచించారు. వివాహ వేడుకలను రద్దు చేసుకుంటున్నారు.. దేశంలో కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు గుమిగూడి ఉండకూడదని వైద్య ఆరోగ్య అధికారులు సూచిస్తుండటంతో పలువురు వివాహ వేడుకలను రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే వివాహ తేదీ ఖరారైన వారు మాత్రం అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వివాహాలు జరిపిస్తున్నారు. అయితే చాలావరకు బర్త్‌డే పార్టీలు, వివాహ రిసెప్షన్లను రద్దు చేసుకుంటున్నారు. -
రిలయన్స్ రిటైల్... @ 2.4 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ రిటైల్ విలువ రూ.2.4 లక్షల కోట్లు(3,400 కోట్ల డాలర్లు) అని అంచనా. రిలయన్స్ రిటైల్ వాటాదారుల కోసం రిలయన్స్ గ్రూప్ ప్రతిపాదించిన షేర్ల మార్పిడి స్కీమ్ ఆధారంగా చూస్తే, రిలయన్స్ రిటైల్ విలువ రూ.2.4 లక్షల కోట్లుగా తేలుతుంది. దేశంలో అతి పెద్ద సూపర్ మార్కెట్ చెయిన్, డిమార్ట్‌ను ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ మార్కెట్ విలువ(రూ.1.20 లక్షల కోట్లు)కు ఇది దాదాపు రెట్టింపు విలువ. ఇంగ్లాండ్‌లో అతి పెద్ద సూపర్ మార్కెట్ చెయిన్ టెస్కో విలువ (3,200 కోట్ల డాలర్లు)కంటే కూడా అధికం కావడం విశేషం. షేర్ల మార్పిడి స్కీమ్‌లో భాగంగా ప్రతి నాలుగు రిలయన్స్ రిటైల్ షేర్లకు గాను ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌ను పొందవచ్చని రిలయన్స్ రిటైల్ వెబ్సైట్ వెల్లడించింది. షేర్ల మార్పిడి స్కీమ్ ఎందుకంటే.., రిలయన్స్ రిటైల్ కంపెనీ తన ఉద్యోగులకు 2006, 2007 సంవత్సరాల్లో స్టాక్ ఆప్షన్స్ ఇచ్చింది. కొంతమంది ఉద్యోగులు ఈ ఆర్ఎస్యూ(రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు)ను ఈక్విటీ షేర్లుగా మార్చుకున్నారు. ఈక్విటీ షేర్లు పొందిన ఉద్యోగులు వీటిని నగదుగా మార్చుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారని రిలయన్స్ రిటైల్ వివరించింది. ఈ కంపెనీని ఇప్పటికిప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసే ఆలోచన ఏదీ లేదని, అందుకే ఈ షేర్ల మార్పిడి స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చామని వివరించింది. రిలయన్స్ రిటైల్‌లో 99.95% వాటా రిలయన్స్ రిటైల్ వెంచర్‌కు ఉందని, మిగిలిన 0.05 శాతం వాటా ఉద్యోగుల వద్ద ఉందని వివరించింది. ఈ షేర్ల మార్పిడి స్కీమ్‌కు ఆమోదం పొందడం కోసం వచ్చే నెల 23న ఈక్విటీ వాటాదారుల సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపింది. పదివేలకు పైగా రిటైల్ స్టోర్స్... దేశవ్యాప్తంగా 10,901 స్టోర్స్‌ను నిర్వహిస్తున్న రిలయన్స్ రిటైల్ కంపెనీ ఆదాయం ఈ ఏడాది మార్చితో ముగిసిన సంవత్సరానికి 89% వృద్ధితో రూ.1.3 లక్షల కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 169 శాతం ఎగసి రూ.5,550 కోట్లకు చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పరోక్ష అనుబంధ సంస్థగా రిలయన్స్ రిటైల్ వ్యవహరిస్తోంది. గురువారం రిలయన్స్ షేర్ రూ.1,516 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.9.6 లక్షల కోట్లు. రిలయన్స్ రిటైల్ కంపెనీని ఐదేళ్లలోపు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తామని ఈ ఏడాది ఆగస్టులోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. -
వారం రోజుల్లో సగానికి తగ్గిన కూరగాయల ధరలు
సాక్షి సిటీబ్యూరో: గతేడాది పోలిస్తే ఈసారి అక్టోబర్ రెండో వారం నుంచే కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. పోయినసారి ఆన్ సీజన్ (ఫిబ్రవరి నుంచి అక్టోబర్) నెలలో కూరగాయల ధరలు మండిపోయాయి. ఈ ఏడాది సెప్టెంబర్ చివరివారం నుంచే నగరానికి శివారు జిల్లాల నుంచి కూరగాయల దిగుమతులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో దాదాపు అన్ని కూరగాయల ధరలు రూ.40 లోపే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింతగా తగ్గుతాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. శివారు జిల్లాల నుంచే 80 శాతం సాధరణంగా ఆన్ సీజన్లో నగర మార్కెట్‌కు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతాయి. అన్ సీజన్లో నగర ప్రజల కూరగాయల అవసరాలు తీర్చిడానికి కమిషన్ ఏజెంట్లు ఇతర రాష్ట్రాలపై అధారపడాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్‌ల నుంచి ఎక్కువ మోతాదులో నగరంలోని బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, ఎల్బీనగర్తో పాటు ఇతర మార్కెట్‌కు రోజుకు 70 నుంచి 80 శాతం వివిధ రకాల కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రల నుంచే కూరగాయల దిమతులు ఉండేవి. ప్రస్తుతం నగర శివారుతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా కూరగాయల దిగుమతులు పెరగడంతో ధరలు తగ్గాయి. నిలకడగా ధరలు ఈ ఏడాది అక్టోబర్ ప్రారంభం నుంచే కూరగాయల ధరలు నిలకడగా ఉన్నాయి. ఇందుకు కారణం గ్రేటర్ శివారు ప్రాంతాల నుంచి నగర మార్కెట్‌కు రోజు దాదాపు అన్ని రకాల కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. గతంలో శివారు ప్రాంతాల నుంచి రోజూ కూరగాయల దిగుమతులు ఉండేవి కావు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్లకు రాని కూరగాయలను కమిషన్ ఏజెంట్లు దిగుమతి చేసేవారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే కూరగాయల ధరలు ఎక్కువగా ఉండడంతో ధరలు నిలకడగా ఉండేవి కావని వ్యాపారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత తగ్గుతాయి తెలంగాణ వ్యాప్తంగా నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో రైతులు ఎక్కువగా కూరగాయలు పండిస్తున్నారు. ప్రత్యేకంగా రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల రైతులు ఈ ఏడాది జూలై నుంచే కూరగాయలను సాగు చేస్తున్నారు. దీంతో సెప్టెంబర్ చివరి వారం నుంచే పంట చేతికొచ్చింది. ఈ కారణంగానే ఈ ఏడాది కూరగాయల ధరలుసెప్టెంబర్ నుంచి తగ్గడం ప్రారంభమయ్యాయి. –కె.శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి,గుడిమల్కాపూర్ మార్కెట్ -
జీఎం ఫుడ్స్.. నగరంలో 32 శాతం లేబుల్స్ లేనివే విక్రయం
సాక్షి, సిటీబ్యూరో :జన్యు మార్పిడి పంటల (జెనిటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్)తో తయారైన ఆహార పదార్థాలు నగర మార్కెట్‌ను ముంచెత్తి ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లేలా చేస్తున్నాయి. నగరంలోని పలు మాల్స్, స్టోర్స్, సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్న చిరుతిళ్లు, నిత్యావసర ఆహార పదార్థాలు, చిన్నపిల్లలు అధికంగా ఇష్టపడే చిరుతిళ్లలో సుమారు 32 శాతం వరకు జన్యుమార్పిడి పంటల నుంచి తయారైనవేనని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇటీవల పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో చేసిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. జీఎం ఫుడ్స్‌లో ప్రధానంగా సోయా, మొక్కజొన్నతో తయారుచేసిన ఆహార పదార్థాలున్నాయని.. ఇవన్నీ ప్రధానంగా కెనడా, అమెరికా, నెదర్లాండ్స్, థాయ్‌లాండ్, యునైటెడ్ అరబ్ఎమిరేట్స్ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవేనని తేలింది. వీటిలో చాలావరకు జీఎం పాజిటివ్ ఆహార పదార్థాలేనని సీఎస్ఈ స్పష్టం చేసింది. అనర్థాలివీ.. ♦ రోగ నిరోధకశక్తిగణనీయంగా తగ్గుతుంది ♦ జీవక్రియ వేగంమందగిస్తుంది ♦ అలర్జీలకు గురయ్యే ప్రమాదం ♦ చర్మం, కళ్ల సంబంధిత జబ్బులు.. ♦ శ్వాస, జీర్ణకోశ సమస్యలు ♦ పలు సాంక్రమిక వ్యాధులు ♦ మన దేశంలో 2013 నుంచి అక్రమంగా జన్యుమార్పిడి పంటల సాగు మొదలైంది. ♦ జీఎం ఫుడ్స్‌లో ప్రధానంగా జన్యుమార్పిడి పత్తి విత్తనాల నుంచి తీసిన నూనెను వివిధ రకాల ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తున్నారు. ♦ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సోయా, మొక్కజొన్న తదితర పంటలతో తయారుచేసిన ఆహార పదార్థాల్లో జన్యుమార్పిడి పంటల ఆనవాళ్లున్నాయి. ♦ జన్యుమార్పిడి పంటలు, వాటితో తయారైన ఆహార పదార్థాలను కట్టడి చేసే విషయంలో ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చేష్టలుడిగి చూస్తోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ♦ గ్రేటర్ నగరంలో విక్రయిస్తున్న జీఎం ఫుడ్స్‌లో ప్రధానంగా ఉదయం అల్పాహారంగా తీసుకునే ఓట్స్, కార్న్ ఫ్లేక్స్ వంటి ఆహార పదార్థాలున్నాయి. ఉల్లంఘనలిలా.. ♦ నగర మార్కెట్లో విక్రయిస్తున్న జీఎం ఫుడ్స్‌లో మూడు రకాలున్నాయి.. జీఎం ఫుడ్స్ ఆనవాళ్లుండి లేబుల్స్ అతికించని పదార్థాలు వీటిలో ఒకటి కాగా.. ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు మించి జీఎం అవశేషాలున్నవి మరొకటి.. అసలు ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న జీఎం ఫుడ్స్ మూడోరకం. ♦ నగరంలోని అన్ని సూపర్ మార్కెట్లు, మాల్స్‌లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో చాలావరకు జీఎం ఫుడ్స్ అనే లేబుల్స్ లేకుండానే విక్రయిస్తున్నట్లు తేలింది. ♦ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యయనంలో దేశంలో సుమారు 65 రకాల జీఎం ఫుడ్స్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించింది. ఇందులో 35 విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి కాగా.. మరో 30 రకాలు దేశీయంగా తయారవుతున్నాయి. ♦ సీఎస్ఈలోని పొల్యూషన్ మానిటరింగ్ ప్రయోగశాలలో పలు రకాల ఆహార పదార్థాలను పరిశీలించగా వీటిలో సుమారు 32 శాతం ఆహార పదార్థాలకు జీఎం పాజిటివ్ అని తేలింది. ♦ ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న ఆహార పదార్థాల్లో సుమారు 80 శాతం వరకు జీఎం పాజిటివ్ ఫుడ్స్ ఉన్నట్లు సీఎస్ఈ వెల్లడించింది. ఇవన్నీ ప్రధాన కంపెనీలకు చెందినవే కావడం గమనార్హం. ♦ జన్యు మార్పిడి పంటలతో తయారుచేసిన ఆహార పదార్థాలు ప్రధానంగా అమెరికా, కెనడా, నెదర్లాండ్స్, థాయ్‌లాండ్, యూఏఈ దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ♦ పలు ఆహార పదార్థాల ప్యాకింగ్ కవర్లపై జీఎం ఆనవాళ్లున్నట్లు ఎలాంటి లేబుల్స్ అతికించడంలేదని తేలింది. ♦ సూపర్మార్కెట్లలో విక్రయిస్తున్న పలు జీఎం పాజిటివ్ ఆహార పదార్థాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదని స్పష్టమైంది. ♦ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని ఆహార పదార్థాల ప్యాకింగ్‌పై జీఎం ఫ్రీ అని ఉన్నప్పటికీ.. వాటిలో జీఎం పంటల ఆనవాళ్లుండడం ఆందోళన కలిగిస్తోంది. కట్టడి చేయాల్సిందే.. నగర మార్కెట్లో ఎలాంటి అనుమతులు, లేబుల్స్ లేకుండా విక్రయిస్తున్న అన్నిరకాల జీఎం ఫుడ్స్‌ను నిషేధించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ఈ విషయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వర్గాలు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని సూచిస్తున్నారు. వినియోగదారులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
బొక్కలేని ముక్క.. ఎంచక్కా!
సాక్షి, హైదరాబాద్ : మాంసం ప్రియులకు శుభవార్త.. ఎముక(బొక్క).. కొవ్వు లేని మాంసం త్వరలో మీ జిహ్వచాపల్యాన్ని తీర్చనుంది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు ప్రయోగాత్మ కంగా టిష్యూ ఇంజనీరింగ్, జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ ఆధారంగా క్లీన్మీట్ తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ సంవత్సరం చివరికి సుమారు టన్ను మాంసం అందుబాటులోకి రానున్నట్లు విశ్వస నీయంగా తెలిసింది. ఈ ప్రయోగం సఫలమై వినియోగదారులకు క్లీన్ మీట్ అందుబాటులోకి వస్తే మాంసం ప్రియులకు పండగేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలా తయారు చేస్తారంటే.. మేక లేదా కోడి శరీరభాగాల నుంచి కణజాలాన్ని సేకరించి ప్రయోగశాలలో సంరక్షాలను అందజేసి ఈ విధానంలో మాంసాన్ని తయారు చేస్తారు. ఇది సాధారణ మాంసంలానే తాజాగా, రుచిగా ఉంటుందట. ధర కూడా సాధారణ మాంసం ఎంత ధర ఉంటుందో అంతే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మాంసంలో సూక్ష్మ జీవ నాశకాలు(యాంటీ బయాటిక్స్), వృద్ధి హార్మోన్ల ఉనికి ఉండదని, దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా, సీసీఎంబీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మాంసాన్ని ప్రయోగ శాలలో తయారు చేస్తున్నారు. ఈ మాంసంలో బ్యాక్టీరియా ఉనికి కూడా ఉండదని చెబుతుండటం గమనార్హం. రాజస్తాన్‌లో శాకాహారులే అధికం రాజస్తాన్‌లో శాకాహారులు అత్యధిక సంఖ్యలో ఉండటం విశేషం. ఆ రాష్ట్రంలో 73.2 శాతం మంది పురుషులు, 76.6 శాతం మంది మహిళలు శాకాహారులే. హరియాణాలో 68.5 శాతం మంది పురుషులు, 70 శాతం మంది మహిళలు.. పంజాబ్‌లో 65.5 శాతం మంది పురుషులు, 68 శాతం మంది స్త్రీలు శాకాహారాన్నే ఇష్టపడుతున్నారు. గ్రామీణ భారతీయుల్లో 6.4 శాతం మంది మటన్.. 21.7 శాతం మంది చికెన్.. 26.5 శాతం మంది చేపలు.. 29.2 శాతం మంది గుడ్లు తింటున్నట్లు ఎన్ఎస్ఎస్ఓ డేటా చెబుతోంది. పట్టణాల్లో 21 శాతం మంది మటన్.. 21 శాతం మంది చేపలు.. 27 శాతం మంది చికెన్.. 37.6 శాతం మంది గుడ్లను వినియోగిస్తున్నారట. జాతీయ స్థాయి సగటు కంటే అధికం.. జాతీయ స్థాయిలో ఏటా సరాసరిన ఒక్కో వ్యక్తి మాంసం వినియోగం 3.2 కిలోలుగా ఉంది. ప్రపంచ సరాసరి మాత్రం 38.7 కిలోలుగా ఉంది. అమెరికాలో అయితే ఏటా ఒక్కో వ్యక్తి 125 కిలోల మాంసాన్ని సరాసరిన వినియోగిస్తున్నట్లు తేలడం విశేషం. జాతీయ స్థాయి సగటు కంటే చికెన్ వినియోగం తెలంగాణలో అధికంగా ఉండటం విశేషం. జాతీయ స్థాయిలో ఏటా ఒక్కో వ్యక్తి సరాసరిన 3.2 కిలోల మాంసం, 65 గుడ్లను వినియోగిస్తుండగా.. తెలంగాణలో 6.5 కిలోల మాంసం.. 90 గుడ్లను వినియోగిస్తున్నారు. హైదరాబాద్ విషయానికి వస్తే ఏటా ఒక్కో వ్యక్తి సగటున 7.5 కిలోల మాంసం, 100 గుడ్లను లాగించేస్తున్నట్లు అంచనా. కృత్రిమ మాంసంతో ఉపయోగాలివే.. దేశంలో ఏటా పెరుగుతోన్న మాంసం డిమాండ్‌ను తీర్చవచ్చు. కొవ్వు, ఎముకలు లేకపోవడంతో పోషకాహారంలా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ సమస్య ఉండదు. తక్కువ భూమి, నీరు వినియోగంతో ఈ మాంసాన్ని తయారుచేయవచ్చు. లక్షలాది మూగజీవులను చంపే అవసరం ఉండదు. గుడ్లు, చికెన్ వినియోగం పెరగాలి పోషక విలువలు అధికంగా ఉండే గుడ్ల వినియోగం ఏటా ఒక్కో వ్యక్తికి 118కి పెరగాలని జాతీయ పోషకాహార సంస్థ సూచించింది. చికెన్ వినియోగంలో సైతం జాతీయస్థాయి సగటు 15 కిలోలకు పెరగాల్సి ఉంది. – రంజిత్‌రెడ్డి, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేశంలో మాంసం వినియోగం ఇలా.. మాంసం వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తోంది. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 2016–17 మధ్యకాలంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అత్యధిక సంఖ్యలో మాంసాహారులు ఉన్నట్లు ఎన్ఎస్ఎస్ఓ(నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్) అధ్యయనంలో తేలింది. ఇందులోనూ.. పురుషుల్లో 98.8 శాతం, మహిళల్లో 98.6 శాతం మంది మాంసాహారులే. మాంసాహారులు ప్రధానంగా మటన్, చికెన్, చేపల వంటకాలనే ఇష్టపడుతున్నారు. మాంసాహారుల విషయంలో రెండో స్థానంలో నిలిచిన పశ్చిమబెంగాల్లో 98.7 శాతం, ఏపీలో 98.4 శాతం, ఒడిశాలో 97.7 శాతం, కేరళలో 97.4 శాతం మంది పురుషులు మాంసాహారులే. ఏటా తెలంగాణలో 4.47 లక్షల మెట్రిక్ టన్నులు, ఏపీలో 5.27 లక్షల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతోంది. -
నెల పాటు నిత్యవసర సరుకులపై 50 శాతం తగ్గింపు
దుబాయ్ : మార్చి 20న అంతర్జాతీయ హ్యాపీనెస్ డే సందర్భంగా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిత్యవసర వస్తువులపై 50శాతం డిస్కౌంట్ ఇస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 600 దుకాణాల్లో ఈ తగ్గింపులు ఉంటాయని అరబ్ వార్త పత్రిక అల్ బయాన్ ప్రచురించింది. ప్రజల వాడే నాణ్యమైన బ్రాండ్ సరుకుల పై ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వినియోగదారుల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ హషిమ్ అల్ నూయిమి సోమవారం ప్రకటించారు. సహకార సంస్థలు, లులూ, కార్ఫోర్ అవుట్ లెట్లు ఈ ఆఫర్ అందించే దుకాణాల జాబితలో ఉన్నాయి. -
అప్పుడు కళ కళ..ఇప్పుడు వెల వెల
-
ఆమె ఓ ‘పబ్లిక్ ఎనిమీ’
సంక్షిప్తంగా... బోనీ ఎలిజబెత్ పార్కర్ ‘‘సూర్య కిరణాలు సోకి, మంచు బిందువులు తాకి పూలలో మకరందం ఊరిన విధంగా, నీ వంటి వారి వల్ల ఈ ప్రపంచం మరింత మధురం, తేజోమయం అయింది’’. బోనీ ఎలిజిబెత్ పార్కర్ సమాధిపై చెక్కి వున్న అక్షరాలివి. ఎవరీ ఎలిజబెత్ పార్కర్? రాజవంశీయురాలా? రాజనీతిజ్ఞురాలా? సంఘ సేవకురాలా? సంస్కర్తా? మత ప్రవక్తా? ఎవరు? ఎవరూ కాదు. ఒక గ్యాంగ్‌స్టర్. దొంగల ముఠా సభ్యురాలు! సరిగ్గా ఎనభై ఏళ్ల క్రితం ఇదే రోజున అమెరికన్ పోలీసులు ఎట్టకేలకు ఆమెను, ఆమె సహచరుడు క్లైడ్ ఛెస్ట్నట్ బారోను చుట్టుముట్టి తుపాకీతో కాల్చి చంపారు. అమెరికాలోని డాలస్ ప్రాంతం నుంచి ‘ఎదిగి’, ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక మాంద్యం సమయంలో రకరకాల దోపిడీలతో మధ్య అమెరికా రాష్ట్రాలను గడగడలాడించిన ఎలిజబెత్.. నేలకు ఒరిగిందన్న వార్త వినగానే బ్యాంకులు, సూపర్ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ‘థ్యాంక్ గాడ్’ అనుకుంది. 1931-1934 మధ్య ఎలిజబెత్, ఆమె సభ్యురాలిగా ఉన్న ముఠా కలిసి కనీసం తొమ్మిదిమంది పోలీసు ఆఫీసర్లను చంపి ఉంటారు. ముఠాను ప్రతిఘటించిన కొందరు పౌరులు కూడా ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. ఈ ఘటనల తర్వాత ఎలిజబెత్‌ను, ఆమె సహచరుడు క్లైడ్ బారోను అమెరికన్ ప్రభుత్వం ‘పబ్లిక్ ఎనిమీ’గా ప్రకటించింది. చివరికి లూసియానాలో ఎలిజబెత్ శకం ముగిసింది. ఆమె చనిపోయాక మీడియాలో ఆమెపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. డిటెక్టెవ్ కథలూ వచ్చాయి. 1967లో ‘బోనీ అండ్ క్లైడ్’ అనే సినిమా కూడా వచ్చింది. పోలీసులు వెంటాడుతున్నప్పుడు ఎలిజబెత్ చకచకా మకాం మార్చేసేవారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు ఆమెకు బదులుగా, ఆమె ఫొటోలు దొరికేవి. ఆ ఫొటోల ఆధారంగా వార్తా పత్రికలు కథనాలను అల్లేవి. మెషిన్‌గన్‌ను ఆమె అలవోకగా ఆపరేట్ చేసేదనీ, క్యామెల్ బ్రాండు సిగరెట్లను ఇష్టంగా తాగేదనీ; ఎలిజబెత్, క్లైడ్ల మధ్య దాంపత్యానికి ఏమాత్రం తక్కువ కాని సాన్నిహిత్యం ఉండేదనీ... ఇలా ఎన్నెన్నో. ఇవన్నీ అలా ఉంచితే ఎలిజబెత్ పార్కర్ స్వభావసిద్ధంగా మంచి అమ్మాయి అనేవారూ ఉన్నారు. బహుశా వారే, ఎలిజబెత్ సమాధిపై ఆమె గురించి నాలుగు మంచి ముక్కలు చెక్కించి ఉండొచ్చు. బోనీ ఎలిజబెత్ పార్కర్ 1910 అక్టోబర్ 1న టెక్సాస్‌లోని రొవెనాలో జన్మించారు. ముగ్గురు పిల్లల్లో రెండోది. తండ్రి తాపీ మేస్త్రీ. ఎలిజబెత్‌కు నాలుగేళ్లున్నప్పుడు ఆయన చనిపోయాడు. దాంతో తల్లి ఎమ్మా క్రాస్ పిల్లల్ని తీసుకుని డాలస్ శివారు ప్రాంతం సెమెంట్ సిటీలో ఉన్న పుట్టింటికి చేరుకుంది. కుటుంబాన్ని పోషించడానికి కుట్టుపనిలో కుదురుకుంది. ఎలిజబెత్ తెలివైన అమ్మాయి. హైస్కూల్లో అన్నిటా తనే ఫస్ట్. స్పెల్లింగ్, రైటింగ్, పబ్లిక్ స్పీకింగ్.. ప్రతిదాంట్లోనూ ప్రథమ బహుమతే! ఎలిజబెత్ చక్కటి కవిత్వం కూడా రాసేది. స్కూల్లో చేరిన రెండో సంవత్సరం ఆమెకు రాయ్ థార్టాన్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ స్కూల్ మానేసి 1926 సెప్టెంబర్ 25న పెళ్లి చేసుకున్నారు. ఎలిజబెత్‌కు అప్పటికి పూర్తిగా పదహారేళ్లు కూడా లేవు. తర్వాత మూడేళ్లకు అభిప్రాయభేదాల వల్ల ఇద్దరూ విడిపోయారు. అలాగని విడాకులు కూడా తీసుకోలేదు. ఎలిజబెత్ అయితే థార్టాన్ తనకు తొడిగిన ఉంగరాన్ని జీవితాంతం అలాగే ఉంచుకున్నారు. విడాకులు తీసుకున్నాక ఆమె కొంతకాలం ఒక రెస్టారెంట్లో వెయిట్రెస్‌గా పని చేశారు. ఆ సమయంలోనే ఆమె జీవితం మలుపు తిరిగింది. క్లైడ్ బారోతో పరిచయం అయింది. పరిచయం ప్రేమ అయింది. ఆ ప్రేమే ఆమెను క్లైడ్ నేర ప్రపంచంలోకి లాక్కెళ్లింది. 1929 నాటి ఎలిజబెత్ డైరీలను బట్టి ఆమె ఎంతో సున్నిత మనస్కురాలని తెలుస్తోంది. తన ఒంటరితనం గురించి, డాలస్‌లో అసహనంగా గడిచిన జీవితం గురించి ఎంతో ఆవేదనగా రాసుకున్నారు ఎలిజబెత్. అలాగే ఫొటో తియ్యడమంటే తనకున్న ఇష్టం గురించి కూడా.