సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.56 కోట్ల నగదు, రూ.2.60 కోట్ల మద్యం సీజ్ చేశారు. 72 కేజీల బంగారం, 429 కేజీల వెండి, 42 క్యారెట్ల వజ్రాలు సీజ్ చేశారు. 5,529 లైసెన్స్‌డ్ తుపాకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 17,128 మందిని పోలీసులు బైండోవర్ చేశారు.
తాజాగా, చందానగర్‌లో భారీగా బంగారం, వెండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 29 కేజీల బంగారం, 26 కేజీల వెండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గంగారంలో నిన్న రాత్రి వాహనాలను తనిఖీ చేస్తుండగా కారులో ఆభరణాలు లభించగా, చందానగర్ పరిధిలోని మలబార్, కళ్యాణ్, లలిత, రిలయన్స్ రిటైల్, విరాజ్ జ్యువెలర్స్ షాపులకు సంబంధించినదిగా పోలీసులు గుర్తించారు.
చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment