న్యూఢిల్లీ: కొద్దీ రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నేడు(ఫిబ్రవరి 11) దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.200 తగ్గి రూ.50,960 చేరుకుంది. కొద్దీ రోజుల క్రితం బడ్జెట్ ప్రకటన అనంతరం పసిడి ధరలు తగ్గగా తర్వాత ఫిబ్రవరి 6 నుంచి మళ్లీ రూ.1000 పైగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.210 తగ్గి రూ.48,600కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ.44,550కు చేరుకుంది. ఆగస్టు 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోల్చి చూస్తే రూ.7,600 తక్కువగా ఉంది. ఇంతకు ముందు ఓ సమయంలో రూ.9000 వరకు తక్కువకు వెళ్లింది. దీంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. నిన్నటితో పోల్చి చూస్తే ఒక్కరోజే 1కేజీ వెండిపై రూ.1,500 తగ్గి రూ.72900కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారీగా పెరుగుతున్న కారణంగా మన దేశంలో కూడా ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment