Today Gold and Silver Prices: అంతర్జాతీయ పరిణామాలు, డాలరు బలం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర 160 రూపాయల తగ్గి రూ.59,840గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల ధర 150 రూపాయలు తగ్గి రూ. 54,850 వద్ద ఉంది. (వరల్డ్ రిచెస్ట్ మేన్‌తో రహస్యంగా కవలలు: ఈ టాప్ ఎగ్జిక్యూటివ్ గురించి నమ్మలేని నిజాలు)
అటు కిలోవెండి ధర 500రూపాయిలు క్షీణించి 77,500గా ఉంది. ఉభయ తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు వరుగా రూ. 55 వేలు, రూ. 55150గాఉన్నాయి. కిలో వెండి ఢిల్లీలో రూ. 73500 పలుకుతోంది. (‘మస్క్ తప్పు చేశావ్..ఇప్పటికైనా అర్థమవుతోందా?’)
శనివారం ఉదయం పెరిగిన ధరలు ఆ తరువాత క్షీణించాయి. ఈ ధరల హెచ్చుతగ్గులకు అనేక రకాల కారకాలు ప్రభావితం చేస్తాయి.ప్రపంచ బంగారం డిమాండ్, వివిధ దేశాలలో కరెన్సీ విలువలు, ప్రస్తుత వడ్డీ రేట్లు , బంగారు వాణిజ్యానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు వంటి అంశాలు ఈ హెచ్చు తగ్గులకు దోహదం చేస్తాయి. దీనికి తోడు గ్లోబల్ ఎకానమీ స్థితి , ఇతర కరెన్సీలతో డాలర్ బలంతో సహా గ్లోబల్ ఈవెంట్‌లు భారతీయ మార్కెట్‌లోని బంగారం ధరలను నిర్ణయిస్తాయి. (ఫెస్టివ్ సీజన్: మారుతి కార్లపై భారీ తగ్గింపు)
Comments
Please login to add a commentAdd a comment