నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం ధరతో పాటు వెండి ధర కూడా తగ్గింది. బంగారం, వెండి ధరలు పెరగకపోవడం వల్ల పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 క్షీణించింది. దీంతో రేటు రూ.45,880కు దిగొచ్చింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.190 క్షీణతతో రూ.42,050కు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.280 క్షిణించి రూ.41,027కు చేరుకుంది.
బంగారం ధరతో పాటు వెండి ధర కూడా తగ్గింది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర రూ.1,000 క్షిణించి రూ.70,800 వద్ద ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.18 శాతం తగ్గుదలతో 1738 డాలర్లకు క్షీణించింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయని గమనించాలి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment