ఇంటి ముందు కూర్చున్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు అపహరించిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.
చందానగర్ (హైదరాబాద్) : ఇంటి ముందు కూర్చున్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు అపహరించిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. డీఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగారానికి చెందిన శాంతమ్మ(70) ఉదయం ఇంటి ముందు మెట్లపై కూర్చుంది. అదే సమయంలో 30 ఏళ్ల వ్యక్తి వచ్చి శాంతమ్మను ఇంటి నెంబర్-50 అడ్రస్ ఎక్కడ అని అడిగాడు. ఆమె సమాధానం చెప్పేలోపు మెడలోని బంగారు గొలుసును తెంచుకొని పారిపోయాడు. కొద్దిదూరంలో బైక్‌తో సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి పారిపోయాడు. శాంతమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అదే ప్రాంతంలో మరో ఘటనలో..
గంగారానికి చెందిన లీలావతి(65) ఉదయం వేళలో ఇంటి ముందు కూర్చోగా అడ్రస్ వెతుక్కుంటూ వచ్చిన ఓ యువకుడు ఆమె మెడలోని బంగారు గొలుసును తస్కరించేందుకు ప్రయత్నించాడు. ఆమె గట్టిగా గొలుసును పట్టుకోవడంతో గొలుసు తెగి కింద పడిపోయింది. వెంటనే లీలావతి గట్టిగా కేకలువేయడంతో దుండగలు గొలుసును వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు.