చందానగర్‌లో వివాహిత బలవన్మరణం | Married Woman Suicide in Chandanagar | Sakshi
Sakshi News home page

చందానగర్‌లో వివాహిత బలవన్మరణం

Dec 18 2019 4:43 PM | Updated on Dec 18 2019 8:29 PM

Married Woman Suicide in Chandanagar - Sakshi

సాక్షి, హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. చందానగర్‌లోని అపర్ణ లేక్ బ్రిజ్ అపార్ట్‌మెంట్‌ 11వ అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని ప్రియాంక శ్రీవాస్తవగా గుర్తించారు. ఆమెకు రెండేళ్ల క్రితం అనుభవ్‌ అనే వ్యక్తితో వివాహం కాగా,  చందానగర్‌లో నివాసం ఉం‍టున్నారు.  వీరికి 10 నెలల బాబు ఉన్నాడు. అయితే, కొడుకును సరిగ్గా చూసుకోలేకపోతున్నాననే బాధతో ప్రియాంక డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో 11వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆమె సంఘటనాస్థలంలో మృతి చెందింది. పై నుంచి దూకడంతో ప్రియాంక దేహం ఛిద్రమైంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement