పొర్లు దండాలకు అనుమతించలేదని...
హైదరాబాద్: పొర్లు దండాలతో అసెంబ్లీ వరకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించటం లేదంటూ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. తన డిమాండ్‌ను నెరవేర్చకుంటే కిందికి దూకేస్తానని బెదిరింపులకు దిగాడు. మియాపూర్ ప్రాంతానికి చెందిన మల్లేష్ గౌడ్..తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే పొర్లు దండాలతో అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపం వద్దకు వస్తాననని దేవుడికి మొక్కుకున్నాడు.
రాష్ట్రం అవతరించటంతో మొక్కు తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం నగర పోలీసులకు అనుమతి కోసం వినతి పెట్టుకున్నాడు. అయితే, వారు నిరాకరించారు.దీంతో అతడు మంగళవారం ఉదయం మియాపూర్ పోలీస్‌స్టేషన్ ముందున్న సెల్‌టవర్ ఎక్కాడు. తన డిమాండ్‌ను అంగీకరించకుంటే కిందికి దూకుతానని బెదిరిస్తున్నాడు. నగర పోలీస్ కమిషనర్ వచ్చేవరకు టవర్‌పైనే ఉంటానని భీష్మించుకు కూర్చున్నాడు. పోలీసులు మల్లేష్ తో సంప్రదింపులు జరుపుతున్నారు