mallesh goud
-
వెల్గొండ విద్యార్థికి 3వ ర్యాంకు..
బిజినేపల్లి (నాగర్‌కర్నూల్): మండలంలోని వెల్గొండ గ్రామానికి చెందిన జి.మల్లేష్‌గౌడ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓయూసెట్‌లో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. ఎంఈడీ చేసేందుకు నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థి మల్లేష్‌గౌడ్ 3వ ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులు, తోటి మిత్రులు అభినందనలు తెలిపారు. హన్వాడ: మండల కేంద్రానికి చెందిన విజయ్‌కుమార్‌కు రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించాడు. మండల ఎంట్రెన్స్ ఫలితాల్లో 76 ర్యాంకు సాధించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. -
పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఆత్మహత్య
మండ్య(బెంగళూరు): త్వరలో పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన శనివారం అర్ధరాత్రి జిల్లాలోని మద్దూరు తాలూకాలో జరిగింది. తాలూకాలోని మరళిగ గ్రామానికి చెందిన మల్లేశ్గౌడ(30)కు ఇదే ఏడాది జూన్ నెలలో మండ్యకు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్లో వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే మల్లేశగౌడ శనివారం రాత్రి ఇంట్లోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనతో నిశ్చితార్థమైన యువతి, ఆమె స్నేహితులే తన ఆత్మహత్యకు కారణమని మల్లేశగౌడ సెల్ఫోన్లో రికార్డ్ చేసినట్లు ఆనవాళ్లు లభ్యమయ్యాయి. మల్లేశగౌడ తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
అజ్ఞాతంలో నయీం అనుచరుడు: పోలీసుల గాలింపు
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు మల్లేష్‌గౌడ్ కోసం సిట్ అధికారులు తమ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతడి కోసం పలు ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. మల్కాజ్‌గిరికి చెందిన న్యాయవాది ముఖి నుంచి రూ. కోటి రూపాయిలు తీసుకున్నట్లు మల్లేష్గౌడ్పై సిట్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అధికారులు తమ గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత మల్లేష్‌గౌడ్ అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. -
పొర్లు దండాలకు అనుమతించలేదని...
హైదరాబాద్: పొర్లు దండాలతో అసెంబ్లీ వరకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించటం లేదంటూ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. తన డిమాండ్‌ను నెరవేర్చకుంటే కిందికి దూకేస్తానని బెదిరింపులకు దిగాడు. మియాపూర్ ప్రాంతానికి చెందిన మల్లేష్ గౌడ్..తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే పొర్లు దండాలతో అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపం వద్దకు వస్తాననని దేవుడికి మొక్కుకున్నాడు. రాష్ట్రం అవతరించటంతో మొక్కు తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం నగర పోలీసులకు అనుమతి కోసం వినతి పెట్టుకున్నాడు. అయితే, వారు నిరాకరించారు.దీంతో అతడు మంగళవారం ఉదయం మియాపూర్ పోలీస్‌స్టేషన్ ముందున్న సెల్‌టవర్ ఎక్కాడు. తన డిమాండ్‌ను అంగీకరించకుంటే కిందికి దూకుతానని బెదిరిస్తున్నాడు. నగర పోలీస్ కమిషనర్ వచ్చేవరకు టవర్‌పైనే ఉంటానని భీష్మించుకు కూర్చున్నాడు. పోలీసులు మల్లేష్ తో సంప్రదింపులు జరుపుతున్నారు -
టీఆర్ఎస్లో చేరిన మల్లేశ్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి, ఆ పార్టీ డీసీసీ మాజీ అధ్యక్షుడు సుంకరి మల్లేశ్ గౌడ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం టీఆర్ఎస్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో ఆయన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు వినోద్‌రెడ్డితో కలసి టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లా అభివృద్ధి విషయంలో చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ నచ్చి జిల్లా నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలు దిండి ప్రాజెక్టుతో అభివృద్ధి చెందనున్నాయని, కాంగ్రెస్ నేత జానారెడ్డి ఊహించని విధంగా పవర్‌ప్లాంట్‌ను దామరచర్లలో సీఎం ప్రారంభించారని అన్నారు. ఐదారుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, మంత్రిగా పనిచేసినా జానారెడ్డి జిల్లా, నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్లో చేరుతున్న వారి గురించి మాట్లాడుతున్న జానారెడ్డి, సుఖేందర్రెడ్డిలే జిల్లాలో ఫిరాయింపులకు బీజం వేసిందని అన్నారు. కోమటిరెడ్డి సోదరులు టీఆర్ఎస్లో చేరేందుకు చాలా ప్రయత్నించినా, కాంగ్రెస్‌ను నాశనం చేసిన వీరు పార్టీలోకి వస్తే నాశనమవుతుందని స్థానిక నేతలు అడ్డుకున్నారని పేర్కొన్నారు. జిల్లా రాజకీయాలను కలుషితం చేసిన జానారెడ్డి, సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు ఓటమి భయంతోనే విమర్శలకు దిగుతున్నారన్నారు. పార్టీలో చేరిన ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లేశ్‌గౌడ్ మాట్లాడుతూ 30 ఏళ్లుగా కాంగ్రెస్‌లో సేవ చేసినా, ఫలితం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని జానారెడ్డి, కోమటిరెడ్డి సోదరులు నాశనం చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి నచ్చి టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు.