హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం అనుచరుడు మల్లేష్గౌడ్ కోసం సిట్ అధికారులు తమ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతడి కోసం పలు ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. మల్కాజ్గిరికి చెందిన న్యాయవాది ముఖి నుంచి రూ. కోటి రూపాయిలు తీసుకున్నట్లు మల్లేష్గౌడ్పై సిట్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అధికారులు తమ గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత మల్లేష్గౌడ్ అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.