హైదరాబాద్ : నగరంలోని మియాపూర్ సిగ్నల్స్ వద్ద ఆదివారం కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో వెళ్తున్న కారు... బైకులను ఢీకొట్టి... వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.