
సాక్షి, హైదరాబాద్: మియపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హాఫిజ్ పేట్ వద్ద బుధవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో కారు అదుపుతప్పి గ్రీన్ బావర్చి హొటల్ ముందు సిగరెట్ తాగుతున్న అఫ్సర్ అనే వ్యక్తి పైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బీహెచ్‌ఈఎల్ ప్రాంతానికి చెందిన అఫ్సర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు స్వల్పంగా గాయపడ్డారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం సేవించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment